పిల్లలకు ఎంత ప్రేమ అందిస్తున్నామో తిరిగి అదే ప్రేమను పిల్లలు తల్లిదండ్రులకు అందించాలని


   ఏలూరు, (ప్రజా అమరావతి);


          వృద్ధులు సంక్షేమానికి , అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి చిత్తశుద్ధి తో  అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి  వనిత తెలిపారు .

     శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ని గిరిజన  భవన్ లో నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత మాట్లాడుతూ  వృద్ధుల సంరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం  జరుగుతుందని ఆమె తెలిపారు .  తల్లిదండ్రులు యవ్వనంలో ఉన్నప్పుడు తమ పిల్లల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి వృద్ధులు అయిన తర్వాత కొంతమంది పిల్లలు సక్రమంగా చూడక పట్టించుకోకుండా ఉన్నవారిని   సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.  మన పిల్లలకు ఎంత ప్రేమ అందిస్తున్నామో  తిరిగి అదే ప్రేమను పిల్లలు తల్లిదండ్రులకు అందించాలని


అన్నారు .మనం మన అత్తామామలు , తల్లిదండ్రులను   ప్రేమతో చూసుకుంటేనే   మన ఇంటికి వచ్చే కోడలు ,అల్లుడు ,  మన కొడుకు ,కూతురు ప్రేమాభిమానాలు చూపిస్తారని ఆమె అన్నారు . ప్రతి ఒక్కరి  జీవితంలో వృద్ధాప్యం విధిగా ఉంటుందని ఆమె తెలిపారు . వృద్ధులకు 60 సంవత్సరాల వారికి  రూ. 2250 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి సంవత్సరం రూ.250 రూపాయలు చొప్పున  పెంచుతూ రూ.3000 వరకు పెంచడం జరుగుతుందని ఆమె అన్నారు .వృద్ధులకు అవసరమైన వీల్ చైర్ , వాకర్స్ , హియరింగ్ మిషన్లు ,హాండ్ స్టీక్స్  అవసరం ఉన్నవారికి వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వదలకుండా అందరిని సమానంగా  చూస్తోందని ఆమె అన్నారు .

కోవిడ్ సమయములో కూడా 60 సంవత్సరాల పైబడి ఉన్న వారందరికీ ముందుగా వ్యాక్సినేషన్ వేయడం , మందులు ఇవ్వడానికి అధిక  ప్రాధాన్యత ఇచ్చి అండగా ఉందని  ఆమె తెలిపారు.  వృద్ధుల కొరకు స్టేట్ కౌన్సిల్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని  కోవిడ్ వలన కొంత ఆలస్యం అయిననూ త్వరలోనే స్టేట్  కౌన్సిల్ ఏర్పాటు చేయడం  జరుగుతుందని ఆమె తెలిపారు . వృద్ధుల కొరకు తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ  చట్టం అమలులో భాగంగా సమస్యలను కేసులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధుల వరకూ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


     జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ తల్లిదండ్రుల  వయోవృద్దుల  పోషణ సంరక్షణ చట్టం 2007 అమలులో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండేవిధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు . ఈ చట్టం చాలా ముఖ్యమైనదని  , దీనిని పటిష్టం గా అమలు చేస్తామని ఆయన తెలిపారు.  జిల్లాలో జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, పోలీస్ అధికారులు అందరూ ఈ చట్టం చిత్తశుద్ధితో అమలు చేయడానికి కృషి చేస్తున్నారని , ఇంకా పటిష్టం గా అమలు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.  వృద్ధులకు సంబంధించిన మంత్రివర్యులు మన జిల్లాలోనే  ఉన్నారని ఆయన అన్నారు . వృద్ధుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని  ,వృద్ధుల సంక్షేమం గురించి మంత్రివర్యులు పై స్థాయి అధికారులను కూడా అడిగి తెలుసుకుంటారని ఆయన తెలిపారు .  వృద్ధులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్

  14567 కు ఫోన్ చేసినట్లు అయితే  తక్షణమే  చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.  జిల్లాలో 1100 పైన గ్రామ , వార్డు సచివాలయం ఉన్నాయని,  అవి అన్ని గ్రామంలోనే పని చేస్తున్నాయని వాటి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు .వార్డు  ,గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారని ఆయన ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చూస్తారని ఆయన తెలిపారు.   జిల్లాలో వృద్ధులకు మొదటిగా వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మొదట 60 సంవత్సరాలు పైబడిన వారికి తర్వాత 45 సంవత్సరాలు, 18 సంవత్సరాలు పైబడిన వారికి చేయడం జరిగిందని ,  60 సంవత్సరాలు పైబడిన వారందరికీ నూటికి నూరు శాతం  వ్యక్షిన్ పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  ఇంకా ఎవరైనా సెకండ్ డోసు తీసుకోకపోయినట్లయితే వారందరూ గ్రామ సచివాలయం లో సెకండ్  డోసు తీసుకోవాలని ఆయన కోరారు . వృద్ధుల అందరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలని , వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అని ఆయన సూచించారు.  పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉన్న  జ్ఞానం ను  సరైన మార్గంలో నేర్చుకో లేకపోతే వారు సరైన మార్గం లో నడవలేరని , అది నేర్చు కున్నవారు సరైన మార్గంలో నడవ గలుగుతారని   ఆయన అన్నారు. అనంతరం జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న ఉన్న  వయోవృద్ధులు చేసిన సేవలకుగాను వారిని 34 మంది వృద్ధులను మంత్రివర్యులు , జిల్లా కలెక్టర్   శాలువా ,మెమొంటో తో సన్మానించారు.

 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అయిన తరువాత జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా  వెళుతూ వృద్ధుల వద్దకు వెళ్లి వారి  ని పలకరించి వారి యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

      ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ,సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ఝాన్సీ రాణి ,  రాష్ట్ర వయో వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ వి. నారాయణ మూర్తి  , సెక్రెటరీ శ్రీ రామచంద్రరావు లు మాట్లాడుతూ వారి సమస్యలను మంత్రి దృష్టికి  తీసుకెళ్లారు.

 

Comments