రెవెన్యూ సేవలను అందించడానికి భూమి రికార్డు లను ప్రక్షాళన చేయడం అవసరం



 కొవ్వూరు (ప్రజా అమరావతి);


కొవ్వూరు డివిజన్ లో సమర్థవంతంగా  రెవెన్యూ సేవలను అందించడానికి భూమి రికార్డు లను ప్రక్షాళన చేయడం అవసరం


అని కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లి బాబు అన్నారు.



శనివారం  కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో తాళ్ళ పూడి, కొవ్వూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, గ్రామ రెవెన్యూ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లా డుతూ డివిజన్ లో భూమి రికార్డు లను స్వచ్చ పరచి, ప్రక్షాళన చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  తాహిసీల్దార్, ఆర్డీఓ ల దశలోనే వెబ్ ల్యాండ్ ఆర్ ఎస్ ఆర్,  వ్రాత ప్రతి ఆర్. ఎస్. ఆర్. సరిపోయేలా చేయడానికి గాను తాహిసీల్దార్ లు పని చేయాలని అన్నారు. ఈ శిక్షణా తరగతుల ను సద్వినియోగం చేసుకుని  క్షేత్రస్థాయిలో భూముల రికార్డ్ ల ను  వి. ఆర్. ఓ లు సక్రమంగా  నిర్వర్తించా లని అన్నారు. విధుల్లో పూర్తి స్థాయిలో నిబద్ధతను చాటాలని స్పష్టం చేశారు.


ఈ  కార్యక్రమంలో  ఏవో జి ఎస్సెస్ జవహర్ బాజీ, కె. ఆర్. సి. తహసీల్దార్   ఎం. మెరికమ్మ , ఆర్ ఐ లు, వీఆర్వో లు, తదితరులు పాల్గోన్నారు.


Comments