ప్రజా సమస్యలపై వార్డు స్థాయిలో పరిష్కారం చూపాలి. ఆర్డీవో ఎస్. మల్లిబాబు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


ప్రజా సమస్యలపై వార్డు స్థాయిలో పరిష్కారం చూపాలి.  ఆర్డీవో ఎస్. మల్లిబాబు
మీమీ గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం కోసం వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉందని, అక్కడ స్పందన ఫిర్యాదులు  ఇవ్వాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.మల్లిబాబు విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజల నుండి స్పందన ఫిర్యాదు లను ఆయన  స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఈ రోజు వివిధ మండలాలు, గ్రామాల నుంచి  పది స్పందన ఫిర్యాదు లు వచ్చాయాన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, రేషన్ కార్డ్, సామాజిక భద్రత పింఛన్లు, ఇంటి స్థలం కోసం, కుటుంబ సమస్యలు,  రెవెన్యూ శాఖ కి సంబంధించిన స్థలాల సమగ్ర సర్వే,  తదితర అంశాలపై ఫిర్యాదులు వొచ్చాయని తెలిపారు. పింఛన్లు, సంక్షేమ పథకాలు కోసం లబ్ధిదారులు జిల్లా, డివిజన్ స్థాయిలోని స్పందన కార్యక్రమానికి రావడం గుర్తించామన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వాలంటేర్, కార్యదర్సులకు ఫిర్యాదులు ఇవ్వాలని, వాటికి తగిన రసీదులు పొందాలన్నారు.  వారు దరఖాస్తులను తిరస్కరించిన కారణాలు తప్పనిసరిగా తెలియచెయ్యాల్సి ఉంటుందని ఆర్డీవో స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ పరిధిలో పరిష్కారం దొరకని వాటిని పరిశీలించి  డివిజన్ స్థాయిలో సదరు  ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కరించడానికి ఆస్కారం వుంటుందని మల్లిబాబు తెలిపారు.  కుమారుడు చూడటంలేదని, రేషన్ కార్డు రద్దు చేసారని, పిల్లలు విషయంలో కోర్ట్ ఉత్తర్వులను తన భర్త పాటించడం లేదని, అనర్హులకు పింఛన్లు వొస్తున్నాయని, చెరువులు ఆక్రమణలు, తదితర అంశాలపై ఫిర్యాదులు వొచ్చాయి. తల్లితండ్రులను చూడని పిల్లలు విషయంలో కోర్టు లో కేసు వేస్తే పింఛను కంటే ఎక్కువ భరణం వొచ్చేలా చేస్తానని తెలిపారు. స్పందన కార్యక్రమంలో  డివిజన్ స్థాయి, మండలస్థాయి  అధికారులు పాల్గొన్నారు.Comments