రాజధాని విషయంలో రెండు పార్టీలు విఫలం చెందాయ

 భారతీయ జనతా పార్టీ

ఆంధ్రప్రదేశ్ (ప్రజా అమరావతి);

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోషల్ మీడియా,పార్టీ మీడియా ప్రతినిధులు, ప్యానల్ లిస్ట్ ప్రతి నిధుల సమావే

శానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు అధ్యక్షత వహించారు  ఈ సందర్భంగా సమావేశ ప్రారంభ ఉపన్యాసాన్ని శ్రీ సోము వీర్రాజు కొనసాగిస్తు  రాష్ట్ర అభివృద్ధి లో మాట తప్పం ,మడమతిప్పం ఇది బిజెపి రక్తంలో ఉందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రెండు పార్టీలు విఫలం చెందాయ


న్నారు..దేశ అభివృద్ధి ప్రాథమిక భాద్యత గా బిజెపి భావిస్తోందని వివరించారు.ప్రణాళికాబద్ధంగా నిరంతర ప్రక్రియ గా బిజెపి పనిచేస్తుంది.పెండింగ్ సాగు నీటి. ప్రాజెక్టు లు విషయంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.పోలవరం విషయంలో ఒక విధంగా ను ,హంద్రీనీవా, గాలేరునగరి ,తోటపల్లి రిజర్వాయర్ విషయాల్లో మరో విధంగాను రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు దృష్టికి తీసుకుని వెళ్ళాలన్నారు.పోలవరం ప్రాజెక్టు కు 13వేలు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే మూడు సంవత్సరాలు గా ఎంతపని జరిగిందనే విషయం మనం లేవనెత్తాల్సిన అవసరం ఉంది.ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కు సంబంధించిన రహదారుల నిర్మాణం, ఇతరమౌలిక వసతులు దశలవారీగా పూర్తి చేస్తున్న విషయం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని ఉద్ఘాటించారు.

 జాతీయ సహ సంఘటనా ప్రధానకార్యదర్శి శివప్రకాష్ జీ మాట్లాడుతూ  బిజెపి పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన భాద్యత పార్టీ మీడియా, సోషల్ మీడియా అధికార ప్రతినిధులపై ఉందని , కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్రమోదీ పైనా  జరుపుతున్న అసత్య ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

బిజెపి దళిత, మైనార్టీ వ్యతిరేక పార్టీగా ముద్రవేసే కుట్రలను  మనము మనసమర్ధపరిపాలన ద్వారా బుద్ధి చెప్పామని , సెక్యులర్ పార్టీ ల ముసుగులో  కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు ఇతర పార్టీల నిజస్వరూపాలను మన విభాగాల ద్వారా బయట పెట్టామని ప్రజలు ఇప్పుడు నిజమైన సెక్యులర్ పార్టీగా భాజాపాను గుర్తించారని అందుకే దేశవ్యాప్తంగా  పార్టీకి ఆదరణ పెరిగి ఎక్కువ రాష్ట్రాల్లో అధికారాల్లోకి వచ్చామని ఎపిలో కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా  ఈ విభాగాలు అవిశ్రాంతగా పని చేయాలని కోరారు.

ఈ విభాగాల ద్వారా జవాబుదారీ తనంతొ పని చేయాలని పార్టీ విస్తరణకు మీ కీలకపాత్ర ఎంతో అవసరమని అందుకు అనుగుణంగా పనిచేయాలని హితవుపలికారు.

జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జి శ్రీ సునీల్ దేవధర్ మాట్లాడుతూ బిజెపి పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను  మీడియా ,సోషల్ మీడియా వేదికల ద్వారా సరైన సమాచారంతో  ప్రతివిమర్శలు గుప్పించాలన్నారు. టీవీ మీడియా మాధ్యమాల్లో  జరిగే చర్చావేదికల్లో ను, సమావేశాల్లో మాట్లాడే ప్రతినిధులు సరైన  భాషణతో  ఎదుటివారిని ఇరుకున పెట్టి వాస్తవాలను ప్రజలకు చేరేలాగా కృషి చేయాలన్నారు.

మాజీ ఛీఫ్ సెక్రటరీ  ఐవిఆర్ క్రుష్ణారావు మాట్లాడుతూ బిజెపి పట్ల రాష్ట్రంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను పూర్తి సమాచారం అవగాహనతో  పార్టీ విభాగాలు ప్రజలకు చేరువయ్యేలాగా క్రుషిచేయడం ద్వారా ప్రతిపక్షాలు చేస్తున్నవంటి కుట్రలను మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఎండగట్టాలని అప్పుడే ప్రజలు మనకు మరింత చేరువ అవుతారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు శ్రీ జివిఎల్ నరశింహరావు,  ఎమ్మెల్శీ శ్రీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డీ, వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ లు వేదికను అలంకరించారు. రాష్ట్రం  మొత్తం నుండి ప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్ర మీడియా విభాగం....

Comments