గాయత్రి దేవి అవతారం లో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు.
ఇంద్ర కీలాద్రి (ప్రజా అమరావతి);
అమ్మ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరూ పైన ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
శనివారం శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ వినాయకుడి గుడి వద్ద నుండి ప్రారంభమైన క్యూలైన్లలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించు ఉంటున్నారన్నారు. 30 విషయాల్లోనే అమ్మవారి దర్శనం కలిగేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందఅన్నారు.
ప్రతిరోజు సాయంత్రం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిదిద్దు ఉన్నామని మంత్రి అన్నారు. రేపు అనగా ఆదివారం నుండి భక్తులు మరింత పెరిగే అవకాశం ఉందని తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
addComments
Post a Comment