*కె.ఎల్.విశ్వవిద్యాలయంలో విద్యార్థులుకు డ్రగ్స్,మత్తు పదార్థాల చెడు ప్రభావాలపై అవగాహన కార్యక్రమం
*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
డ్రగ్స్.. ఈ పేరు మన ప్రాంతంలో వినిపించేది తక్కువే కానీ వినియోగం ఎక్కువగానే ఉందని సౌత్ కోస్టల్ జోన్ డిఐజి డాక్టర్ సి.ఎం.టి.వర్మ అన్నారు. శుక్రవారం కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో డ్రగ్స్, మత్తు పదార్థాల చెడు ప్రభావాలపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్, చెర్రస్ తదితర మాదకద్రవ్యాలకు బానిసలై మన జిల్లాలోను కొంత మంది యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణ కాలం సంతోషం కోసం విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటోందని తెలిపారు. ఒంటరితనం, మానసిక బలహీనత, ఉరికే యవ్వనం..ఇలా అనేక కారణాలతో కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మాదకద్రవ్యాలకు చాలా మంది ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యావంతులే అలవాటు పడుతున్నారని, పరిస్థితి చేజారాక మానసిక వైద్యనిపుణల వద్దకు వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయని వెల్లడించారు. కొందరు విద్యార్థులు గంజాయి రవాణాలో చిక్కుకుని పోలీసులకు పట్టుబడి జీవితం జైలు పాలు చేసుకుంటున్నరాని తెలిపారు. ఇప్పటి దాకా గుంటూరు(రురల్,అర్బన్) నెల్లూరు, ఒంగోల్, జిల్లాలో 100 కేసులు నమోదు చేశామని చెప్పారు. జనవరి నుంచి 5000 కె.జి ల గంజాయిని పట్టుకున్నామని,3200 గంజాయిని గుంటూరు అర్బన్ లో పట్టుబడినట్లు వెల్లడించారు. గుంటూరు అర్బన్ పరిధిలో 50 లిక్విడ్ గంజాయిని6 పట్టుకునన్నామని, దీనిని గుజరాత్ వాడోడరా లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో (పరుల్ యూనివర్సిటీ) చదువుతున్న గుంటూరుకి చెందిన విద్యార్థి విశాఖపట్నంలోని ఏజెన్సీ ద్వారా బరోడా లోని తను చదువుతున్న యూనివర్సిటీకి తెప్పించుకున్నట్లు వెల్లడించారు. ముందుగానే తమకూ విషయం తెలియడంతో బరోడా ఎస్పీతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ ప్రకారం విద్యార్థులు తక్కువ మొత్తంలో పట్టుబడితే 1 సంవత్సరం జైలు శిక్ష, ఏక్కువ మొత్తంలో పట్టుబడితే 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు మత్తుకు బానిసలుగా కాకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ ఆఫీజ్ మాట్లాడుతూ, నిషేధిత మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకో వద్దని సూచించారు.మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మార వద్దని స్పష్టం చేశారు.డ్రగ్స్,గంజాయి వాడినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన కల్పించిన అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బిందు మాధవ్, ఎన్ఫోర్స్మెంట్ సుపరిటెండెంట్ అన్నపూర్ణ, అడిషనల్ సుపరిటెండెంట్ మణికంఠ, ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ,రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి.ప్రసాద్రావు, విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్ డాక్టర్ కె.ఆర్.ఎస్.ప్రసాద్, అడ్వైసర్ డాక్టర్ హాబీబుల్లా ఖాన్, చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ మధుసూదన్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment