వాడవాడలా ... ఆ "ద"సరా ఉత్సవాలు

 


చాగల్లు (ప్రజా అమరావతి) ;  


* వాడవాడలా ... ఆ "ద"సరా  ఉత్సవాలు* ఒకేసారి రెండు పండగలు మన మహిళలు జరుపుకొంటున్నాం...


పిల్లల పౌష్టికాహారం కోసం ఐసీడీఎస్ ద్వారా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. 


- మంత్రి తానేటి వనిత 

మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారికత దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. 


సోమవారం చాగల్లు  మండలం బ్రహ్మాణగూడెం, తదిరత గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ,  గతంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యని ప్రతిపక్షాలు, ఈ రోజు జగనన్న చేస్తున్న పథకాలకు అడుగడుగునా అవరోధాలు సృష్టించడం మీకు తెలిసిందే.  కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్ధిక పరిస్థితిని సాకుగా చూపి  హామీ లను వాయిదా వెయ్యవొచ్చు, కానీ మన జగనన్న అలా చెయ్యలేదు.


  మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే , ఆయా కుటుంబాలు ఆర్ధిక పురోగతి సాధించగలవనే నమ్మకం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్ధిక తోడ్పాటు తోపాటు రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు రాజకీయ, నామినేటెడ్ పదవులు, పోస్టు ల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే అన్నారు. 

వైఎసర్బ్ ఆసరా కింద చాగల్లు మండలం లోని 1235 గ్రూపుల్లోని స్వయం సహాయక సభ్యులకు 4 విడతల్లో రూ.44 కోట్ల 61 లక్షలు ప్రయోజనం కలుగ చేస్తున్నామన్నారు. తొలివిడతగా రూ. 11 కోట్ల 11 లక్షలు అందించగా, రెండో విడతలో రూ.11 కోట్ల 16 లక్షల 59 వేలు అందించి ఇచ్చిన హామీలకు కట్టుబడి రుణమాఫీ అమలు చేయడం జరుతోందన్నారు. ఈ ఈ మొత్తాలను ఆర్థికాభివృద్ధి కోసం వినియోగించాలని మంత్రి కోరారు. 

మీ కుటుంబాల కు మహిళ లే కుటుంబ యజమానులు గా, ప్రధాన ఆధారంగా ఉండాలని వారిపేరునే ఇళ్ల పట్టాలు అందిస్తున్న ట్లు తెలిపారు.   వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు  దసరా పండుగ రోజుల్లో అందచేసే క్రమంలో మీ ఈ వేడుకలు మీ మధ్య జరుపుకుంటున్నా మన్నారు.   ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీమీ కుటుంబాల  ఆర్ధిక అభివృద్ధి కి వినియోగించుకొవాలని కోరారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగు తోందన్నారు. దిశా చట్టం ఆమోదం కేంద్రం వద్ద పెండింగులో ఉండగా, దిశా యాప్ ద్వారా మహిళల భద్రతకు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇటువంటి ముఖ్యమంత్రి ని భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉంది. మీకు అడుగడుగునా అండగా, తోడుగా నిలుస్తున్న జగనన్నను 2019 లో ఇచ్చిన ఆశీర్వాదాలు 2024 లో కూడా ఇవ్వాలన్నారు.చాగల్లు  మండలం లో  వైఎస్సార్ ఆసరా రెండో విడతగా బ్రహ్మణగూడెం లోని 109 గ్రూపులకు రూ.72.76 లక్షలు, ;  మల్లవరం లో  44 గ్రూపులకు రూ.48.28  లక్షలు; మార్కొండపాడు  105 గ్రూపులకు రూ. 114 లక్షల 72 వేలు,  ; చాగల్లు లో  366 గ్రూపులకు  రూ. 366 లక్షలు,  లక్షలను  వైఎస్సార్ ఆసరా రెండో విడత మొత్తాలను మహిళా సభ్యుల  లబ్దిదారుల ఖాతాకు చెల్లింపు చేశామన్నారు. 


తొలుత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. తదుపరి వైఎస్సార్ ఆసరా చెక్కును అందచేశారు. డ్వాక్రా మహిళలు జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. 


 కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ లు  బ్రాహ్మణగూడెం ..  గురువె ళ్లి  కుమారి, చాగల్లు .. ఎస్. మనః శాంతి , మార్కొండపాడు .. కండ్రిక లక్ష్మీ శివపోసి, చంద్రవరం .. ఎమ్.శ్రీనివాసరావు, దారవరం.. ఎమ్. రవి ప్రసాద్,  ఎస్.ముప్పవరం .. ఎమ్. మహాలక్ష్మీ,   మల్ల వరం ..కె. లక్ష్మీ సుభాషిణి, గౌరిపల్లి .. తాళ్లూరి హైమావతి, చాగల్లు జెడ్పిటిసి గారపాటి విజయదుర్గా, ఎంపిపి మాట్టా వీరాస్వామి, ఉపాధ్యక్షులు జె.రామచంద్రరావు,  ఎంపీటీసీ ఉసురుమర్తి జ్యోతి,  పి.వెంకటేశ్వర రావు, టి.గాంధీ,  గి.వెంకట నరసింహమూర్తి, ఉ. భాగ్య వతి, ఎల్ ఎన్ ఎస్ ప్రభావతి, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర సంచాలకులు ఎస్ కె. సర్దార్ పాషా, ఎఎంసి ఛైర్మన్ ఏ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కె శివరామ కృష్ణ, రాష్ట్ర రైతు వికాసం జనరల్ సెక్రటరీ ఏ దొరైస్వామి, కట్టా ఉమా మహేశ్వరరావు,  ఎంపీడీఓ బి. రాం ప్రసాద్, తాహసీల్దార్ ఎమ్. శ్రీనివాసరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురా లు ఎన్. సుబ్బలక్ష్మి,   ఇతర ప్రజాప్రతినిధులు,  అధికారులు, మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.Comments