క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారుల ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత

  ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి)!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను , భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించిన  జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ)డా.కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్ కుమార్,సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్


క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారుల ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కె.మాధవిలతమెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో, క్యూ లైన్ల ,ఓంకారం ప్రాంతాల్లో పర్యటించి భక్తులతో మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ ను కూడా తెలుసుకున్న రు.


అనంతరం మంగళవారం ఇంద్రకీలాద్రి కి రానున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.


ప్రోటోకాల్ విధులు నిర్వహిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నారాయణరెడ్డి, తహసీల్దార్ బి.భద్రు లను విఐపి ల రాకపోకలను అరా తీశారు.

Comments