రైతన్నల లోగిళ్ళలో ముందే వచ్చిన దీపావళి కాంతులు, ఒకే రోజు మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*

*వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు*

*వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం*


*నేడు (26.10.2021, మంగళవారం) క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*రైతన్నల లోగిళ్ళలో ముందే వచ్చిన దీపావళి కాంతులు, ఒకే రోజు మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది


*


*వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,191 కోట్ల లబ్ది...ఇదివరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,214 కోట్లు నేడే బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం*


*1. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*


కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద వరుసగా మూడో ఏడాది కూడా అక్టోబర్‌లో ఇవ్వనున్న రెండవ విడతగా 50.37 లక్షల మంది రైతన్నలకు రూ. 2,052 కోట్ల లబ్ది


దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం


ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,052 కోట్లతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు


చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం

మ్యానిఫెస్టోలో చెప్పింది – ఏటా రూ. 12,500 – 4 సంవత్సరాలు – రూ. 50,000

శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్నది – ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలు – రూ. 67,500

రైతన్నలకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500


*మొదటి విడత – ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500*

*రెండో విడత – ఖరీఫ్‌ పంట కోత సమయం అక్టోబర్‌ నెల ముగిసేలోపు, రబీ అవసరాల కోసం రూ. 4,000*

*మూడో విడత – ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000*


*2. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు*


ఈ పథకం క్రింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 112 కోట్ల వడ్డీ రాయితీ


ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేరుగా జమ


చక్రవడ్డీల పద్మవ్యూహంలో చిక్కుకుని అన్నదాతలు అప్పుల ఊబిలో పడిపోకుండా వారికి అండగా నిలుస్తూ ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని అందిస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించిన రూ. 382 కోట్లతో సహా, ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీ రూ. 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 62.78 లక్షల మంది రైతన్నలకు రూ. 1,674 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ప్రభుత్వం


*3. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం*


వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,868 రైతు గ్రూపులకు రూ. 27.17 కోట్ల లబ్ది నేడే జమ


సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి విత్తు నుండి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్ధాయి యంత్రసేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌), వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image