కమిషనర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గా నియమితులైన వి.రామకృష్ణ బుధవారం గౌరవ ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.

 


విజయవాడ,అక్టోబర్ 6 (ప్రజా అమరావతి);


 కమిషనర్  ఇన్‌స్పెక్టర్ జనరల్ గా నియమితులైన వి.రామకృష్ణ బుధవారం  గౌరవ ముఖ్యమంత్రిని కలిసి  పుష్పగుచ్చాన్ని అందజేశారు.



 ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  రిజిస్ట్రేషన్ సేవల నాణ్యతను మెరుగుపరచాలని మరియు వ్యవస్థను బలోపేతం చేసి డిపార్ట్‌మెంట్ , ప్రభుత్వ ఇమేజ్‌ను మెరుగుపరచాలన్నారు. ప్రజల దృష్టిలో డిపార్ట్‌మెంట్ పైవున్న  అవగాహనను మార్చాలని మరియు సేవలు అట్టడుగు స్థాయికి చేరుకునేలా చూడాలని ముఖ్యమంత్రి కమిషనర్ కు సూచించారు.


అనంతరం కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ (R&S) వి.రామకృష్ణ బుధవారం    వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో DIG మరియు జిల్లా రిజిస్ట్రార్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందించే సేవల స్థితిని అలాగే 30, సెప్టెంబర్ 2021 వరకు రెవెన్యూ స్థితిని సమీక్షించారు. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన మరియు నాణ్యమైన సేవలను అందించాలని కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ అధికారులను ఆదేశించారు.  కొంతమంది ఉద్యోగుల వైఖరి లో మార్పు రావాలని  తద్వారా  డిపార్ట్‌మెంట్ ఇమేజ్‌ను మెరుగుపరచాలన్నారు. ఆదాయాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేయాలన్నారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించాలన్నారు.లక్ష్యాలను సాధించాలన్నారు.  సిబ్బందిలో విశ్వాసం నింపాలని మరియు జిల్లా స్థాయిలోనే సిబ్బందితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నాయకుడిగా వ్యవహరించాలని ఆయన అధికారులందరికీ సూచించారు.

Comments