*స్వర్ణ కవచాలంకృతే నమోనమః*
ఇంద్ర కీలాద్రి (ప్రజా అమరావతి);
*ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు*
*ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి* .
గురువారం తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అష్టభుజాలతో సింహాసనం పై త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరుస్తున్న జగన్నాతను దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు.
కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు నుండి భవానీ లు అమ్మవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ మానవీయ బిశ్వ భూషణ్ హరి చందన్,సప్రవ హరిచందన్, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ ఈవో డి.భ్రమరాంబ, ధర్మకర్త ల మండలి చైర్మన్ ఫైలా సోమినాయుడు,సామినాయుడు కొండపై ఏర్పాట్లు ను పరిశీలించారు.
addComments
Post a Comment