వేగంగా ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి సాధించేందుకే "పీఎం గతిశక్తి" : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*వేగంగా ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి సాధించేందుకే "పీఎం గతిశక్తి" : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*


పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి


అమరావతి, అక్టోబర్, 13 (ప్రజా అమరావతి): వేగంగా అభివృద్ధి సాధించడం కోసమే పీఎం గతిశక్తి లక్ష్యమని  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం  "పీఎం గతిశక్తి" ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మేకపాటి హైదరాబాద్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ ను గత ఆగస్ట్ 15వ తేదీ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ప్రధాన మంత్రి మోడీ ప్రకటించారు. నేడు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో పీఎం ప్రారంభించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ప్రతి రంగంలో ఇక అభివృద్ధి పనుల పరుగులు పెట్టడమే కాకుండా ప్రచారం ఊపందుకోనుంది. భవిష్యత్తులో రాష్ట్ర యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ కోసం రూ.100 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక ఉత్పత్తులను ప్రపంచస్థాయిలో నిలబెట్టేదిశగా ఏపీ గతిశక్తికి తగ్గట్లు ప్రణాళిక రూపొందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ‘లోకల్ ఫర్ వోకల్’ మంత్రంతో  ప్రపంచంతో పోటీ పడే స్థాయికి వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం సాగరమాల, భారతమాల, ల్యాండ్ పోర్ట్స్, ఉడాన్ తరహాలోనే పీఎం గతిశక్తిని ప్రారంభించినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తయారీతో పాటు ఎగుమతులను పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రతి ఉత్పత్తిని ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంచాలన్న లక్ష్యం వైపు ఇక యావత్ దేశం పరుగులు పెట్టనుందన్నారు. ఉత్పత్తిని పెంచడం, సమయం వృథా తగ్గించడం కోసం, వృద్ధి రేటు పెంచడం, ఎగుమతులను మరింత పెంచడం తదితర ప్రాధాన్యాతలతో గతిశక్తి గాడిన పెట్టనుందన్నారు. కార్గో సామర్థ్యం, పోర్టుల అభివృద్ధి , పారిశ్రామిక కారిడార్లను వేగంగా పూర్తి చేయడం, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడం, వాటర్ వేలను తీసుకురావడం, సరకు రవాణాపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి వాటిపై మరింత దృష్టి పెట్టి పాలసీ సమయంలోపు పీఎం గతిశక్తి అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధిలో దూసుకెళ్తామని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.Comments