*"వార్డు సభ్యులకు శిక్షణలో కాకాణి
"*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలంలో వార్డ్ సభ్యులు ఉప సర్పంచులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*శిక్షణ ముగించుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.*
స్థానిక సంస్థల వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర వార్డు సభ్యులదేనని చెప్పడంలో సందేహం లేదు.
గ్రామాలలో వార్డు సభ్యులు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలిగితే ప్రజలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయగలం.
వార్డు సభ్యులు తమ విధివిధానాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
గ్రామాలలోని ప్రజల అవసరాలు తీర్చడంతోపాటు, గ్రామస్తులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కూడా వార్డు సభ్యులు ప్రధాన పాత్ర పోషించాలి.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేనివిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
తమ వార్డులలో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రజలకు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అందించాలి.
గ్రామపంచాయతీ సమావేశాలకు, గ్రామసభలకు వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరై సూచనలు, సలహాలు ఇవ్వాలి.
వార్డు సభ్యులు తమ పదవులను మొక్కుబడిగా కాకుండా, అత్యంత బాధ్యతాయుతంగా భావించాలి.
గ్రామపంచాయతీ వార్డు సభ్యుల దగ్గర నుండి దేశ ప్రధాని దాకా ప్రజాప్రతినిధులమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
స్థానిక సంస్థలకు మా కుటుంబానికి విడదీయరాని అనుబంధ సంబంధాలున్నాయి.
గ్రామపంచాయతీ అధ్యక్షురాలిగా నా తల్లి 25 సంవత్సరాలు, సమితి అధ్యక్షులుగా నా తండ్రి 18 సంవత్సరాలు, జిల్లా పరిషత్ అధ్యక్షునిగా నేను 5 సంవత్సరాలు పనిచేశాం.
పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు అంచెలలో మా కుటుంబం పాలుపంచుకుంది.
పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలపడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సచివాలయాల ద్వారా వాలంటీర్ల సహకారంతో గ్రామాలలో సమస్యలు పరిష్కరిస్తూ, వార్డు సభ్యులు ప్రజలకు చేరువకావాలి.
ప్రజలచే ఎన్నుకోబడిన వార్డు సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తూ, శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పిస్తున్న అధికారులకు నా ధన్యవాదాలు.
గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు స్థానిక శాసనసభ్యునిగా నా సంపూర్ణ సహాయసహకారాలు ఎల్లవేళలా అందిస్తా.
addComments
Post a Comment