*"టిటిడిలో పాలనా అంశాలపై దేవాదాయ శాఖ అధికారుల అధ్యయనం*
తిరుపతి (ప్రజా అమరావతి):
తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలుచేస్తున్న అనేక పరిపాలన అంశాలను అధ్యయనం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అమలుచేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ఆ శాఖ అధికారులు మంగళవారం టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవిని కలిశారు.
అనంతరం తిరుపతిలోని పరిపాలనా భవనంలో జెఈవో అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టిటిడిలో ఆడిటింగ్, అకౌంటింగ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, అన్నదానం, ప్రసాదాల తయారీ, వంటశాలల ఆధునీకరణ, ఆదాయమార్గాలు మెరుగుపర్చడం, టికెట్ల జారీ విధానం, ఐటి, టెండర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, మాస్టర్‌ప్లాన్ తయారీ, బంగారు ఆభరణాల డిజిటైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ప్రాపర్టీ రికార్డుల నిర్వహణ తదితర అంశాలను జెఈవో వారికి వివరించారు. అదేవిధంగా టిటిడి అధికారులు ఈ విభాగాలకు సంబంధించిన పరిపాలన విధానాలను తెలియజేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, ఎస్ఇ శ్రీ ఎస్.శ్రీనివాసరావు, ఈఈలు శ్రీ దుర్గేష్, శ్రీ జివిఆర్.శేఖర్, గెజిటెడ్ సూపరింటెండెంట్ శ్రీ రానా ప్రతాప్, ఇడిపి అధికారి శ్రీ ప్రసాద్, డెప్యూటీ కమిషనర్లు శ్రీ ఎం.రత్నరాజు, శ్రీ వివిఎస్‌కె.ప్రసాద్, ఎఇ శ్రీ సాయి ఈశ్వర్, టిటిడి విజివో శ్రీ మనోహర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి శ్రీ ఎల్ఎం.సందీప్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎం.రమేష్‌బాబు, సిఇ ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్ పాల్గొన్నారు.
addComments
Post a Comment