ఒక్క పైసా కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌బకాయిలు లేవు



- ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఈనాడు పత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం. ఆ కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధం. 

- ఒక్క పైసా కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌బకాయిలు లేవు

- ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున కచ్చితంగా చెల్లింపులు

- ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టరు క్రింద రూ. 670 కోట్లు, 

- రెండవ క్వార్టరు క్రింద రూ. 693.27 కోట్లు అందించాం.

- మూడవ క్వార్టర్‌... అయిన జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు హాజరు వివరాలను పరిశీలిస్తున్నాం.

- నవంబరులో మూడో త్రైమాసికం చెల్లింపులు

- జగన్‌గారి ప్రభుత్వంలా గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా ఇలా ఫీజు  రియింబర్స్‌మెంట్‌ చేయలేదు

- దేశంలో ఎక్కడా కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ఇలా ఇవ్వడంలేదు.

- గత ప్రభుత్వం ఫీజుకింద పెట్టిన రూ.1880 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది.

- 2019-2020 సంవత్సరానికి సంబంధించి రూ.౨౨౦౦ కోట్లు చెల్లింపు.

- పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ను సీఎం గారు ఉదారంగా సీనియర్‌విద్యార్థులకూ అమలు చేశారు

- ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సంతృప్తిగా ఉన్నాయి. 

- కరోనాకాలంలో కళాశాలలు నిలబడ్డాయంటే సియం జగన్ మోహన్ రెడ్డి గారు కారణం.

- రాష్ట్రంలో ఉన్నత విద్యలో 87 శాతం విద్యార్ధులకు పూర్తిగా ఫీజు రీఎంబర్స్ మెంట్ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ..

- జగనన్న విద్యాదీవెన కింద  ఈ ప్రభుత్వం... రూ.5572.55 కోట్లు ఖర్చు చేసింది... వసతి దీవెన కింద రూ.2267 కోట్లు ఖర్చు చేసింది.

- ఇలా  సమర్థవంతంగా అమలు చేస్తున్న ఫీజురియింబర్స్‌మెంట్‌పై వ్యతిరేక ప్రచారం, దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌హేమచంద్రారెడ్డి..


- సకాలానికే ఫీజు రియింబర్స్‌మెంట్‌జరుగుతోంది.

- త్రైమాసికానికోసారి చెల్లింపు వల్ల కాలేజీలకు ఆర్థికంగా మేలు.

- కరోనాలాంటి కాలంలో కూడా ఫీజులు ఆగలేదు: ‘కాలేజీయాజమాన్యాల ప్రశంస


అమరావతి (ప్రజా అమరావతి):

ఉన్నత విద్యలో రాష్ట్రంలోని 87 శాతం విద్యార్ధులకు పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. 

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత విద్యా దీవెన, వసతిదీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు.

201819 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు రూ. 1,880 కోట్లు, 201920 కు రూ. 2,200 కోట్లు ఫీజు రీఎంబర్స్ మెంట్ గా చెల్లించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ఉన్నవిద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు (వర్చువల్ గా) ఆల్దాండ్ బి బిల్డింగ్ మీడియా పాయింట్ వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ పై వివరించారు.  ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నవంబరు 30వ తేదీ నుండి జగనన్న విద్యా దీవెనె, జగనన్న వసతి దీవెనె పధకాలు అమల్లోకి వచ్చాయని, వీటి ద్వారా విద్యార్ధులకు ఒక్క పైసా ఖర్చుకాకుండా చదువుకు అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన అన్నారు. 

గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ క్రింద రూ. 35 వేల రూపాయలే అందిస్తే , ఈ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెనె క్రింద పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ అందిస్తున్నదని, దీనితో పాటు సాధారణ డిగ్రీ, పిజి విద్యార్థులకు రూ. 20 వేల వరకూ స్కాలర్ షిన్లుగా ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన తెలిపారు. 

2020 మేనెలలో ట్యూషన్ ఫీజును తల్లుల ఖాతాల్లోనే జమచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రతీ 3 నెలలకు ఒకసారి సంవత్సరంలో 4 దఫాలుగా ఫీజు రీఎంబర్స్ మెంట్ ఆయా తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టరు క్రింద రూ. 670 కోట్లు, రెండవ క్వార్టరు క్రింద రూ. 693.27 కోట్లు ప్రభుత్వం అందించిందని ఆయన అన్నారు. 

3 వ క్వార్టరుకు సంబంధించి హాజరు వివరాలు పరిశీలించి.. నవంబరులో జమచేస్తున్నామని.. ఇక్కడ ఆలస్యం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా స్కాలర్ షిప్ విధానంలో నిబంధనలు మార్పుచేసి విద్యార్ధులకే చెల్లించాలని నిర్ణయం తీసుకుందని అయితే ఈ ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

ఇంత పగడ్బందీగా పథకాన్ని అమలు చేస్తుంటే.. దీనిపై వ్యతిరేక ప్రచారం, దుష్ప్రచారం తగదన్నారు. 

రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ క్రింద ప్రభుత్వం అందించే సొమ్మును ఖర్చుగా భావించుట లేదని, ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆలోచనలు ప్రకారం విద్య పై పెట్టే ఖర్చు విద్యార్ధుల భావితరాలకు పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. 

ఈ ప్రభుత్వం ఉన్నత విద్యావిధానంలో కొన్ని మౌలిక మార్పులు తీసుకురావడానికి పలు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. 

2020 కేంద్ర ప్రభుత్వ స్కాలర్ షిప్పుల నిబంధనల మేరకు ప్రతీ కళాశాలకు అక్రిడిటేషన్ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, కళాశాలల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలని, ప్రతీకళాశాల మూడేళ్లలో అక్రిడిటేషన్ స్టాటస్ తీసుకోవాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన అన్నారు. 

కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం ఇస్తున్న క్వార్టర్లీ రీఎంబర్స్ మెంట్ పట్ల సంతృప్తిని అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం పై ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తున్నదని అన్నారు. 

చాలా పిజి కాలేజీల్లో అవకతవకలు జరుగుతున్నాయని దీనిపై విజిలెన్స్ ఎంక్వైయిరీ జరుగుతున్నదని దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణ కోర్సులతో పాట సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు కూడా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తున్నదన్నారు. దీనికోసం ప్రభుత్వంకు అదనపు భారం రూ. 250 కోట్లు పడుతున్నదన్నారు. విద్యాసంవత్సరం ముగిసేముందు క్వార్టరు ఫీజుకు సంబంధించి ఫీజు రీఎంబర్స్ మెంట్ కళాశాలల యాజమాన్యాలకు చేరేలా తగిన నిర్ణయం తీసుకోబోతున్నదన్నారు.

రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు కన్వీనర్ కోటా క్రింద కేటాయించేలా చర్యలు తీసుకున్నామని దీనిలో భాగంగా 35 శాతం విద్యార్ధులకు పూర్తి స్థాయి రీఎంబర్స్ మెంట్ అందిస్తున్నామని హేమచంద్రా రెడ్డి అన్నారు. కరోనాకాలంలో కూడా ఫీజు బకాయిలు లేకుండా చూశామన్నారు..

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ఫీజులు బకాయిలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, గతంలో రెండేళ్ల వరకూ బకాయిలు పెండింగ్ లో ఉండేవని, ప్రభుత్వం ఒక్క రూపాయికూడా బకాయిలు లేకుండా చూస్తున్నదని, నిధుల విడుదలలో ఎక్కడా జాప్యం లేదని, యస్ఆర్ యం లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కూడా ఏపి విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు సంతృప్తిగా ఉన్నాయి...

ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ ఛైర్మన్ గంగి రెడ్డి మాట్లాడుతూ 201920 ఫీజు రీఎంబర్స్ మెంట్ పూర్తిగా చెల్లించారని, గత రెండు క్వార్టర్లు చెల్లించడం వలన ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు పూర్తిగా సంతృప్తి చెందాయని అన్నారు. సియం జగన్మోహన రెడ్డి వల్లనే కరోనాకాలంలో కూడా కాలేజీలు నిలబడ్డాయన్నారు.

అటానమస్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ తరపున యం. వెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ సియం వైయస్. జగన్మోహన రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూరుశాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామన్నారు. గతంలో ఫీజులు బకాయిలు ఉండేవని ఇప్పుడు అన్నీ క్వార్టర్లకు విడుదల చేస్తున్నామన్నారు. కరోనాకాలంలో కాలేజీలు నిలబడ్డాయంటే సియం జగన్మోహన రెడ్డి కారణం అన్నారు. ఫీజులు ఇవ్వకపోతే యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పడేవని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే ఫీజురీఎ ంబర్స్ మెంట్ సకాలంలో పద్ధతి ప్రకారం చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. 

క్వార్టర్లీ రీఎంబర్స్ మెంట్ తో కళాశాలలకు ఆర్ధిక పరిపుష్టి...

ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ యన్. శేషారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్ మెంట్     తీసుకువచ్చిన మహానేత వై.యస్. రాజశేఖర రెడ్డి అని దానిని సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత జగన్మోహన రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు. ప్రతీ మూడు నెలలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు చెల్లించడం వలన కళాశాలలు ఆర్ధికంగా బలపడి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతున్నదన్నారు. తెలంగాణాలో ఇప్పటికీ మూడు, నాలుగు సంవత్సరాల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అన్నారు. డిగ్రీ, పిజి కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ప్రైవేట్ కళాశాలల సెక్రటరీ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

 

Comments