ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

 


కొవ్వూరు  (ప్రజా అమరావతి); 

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం  కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, పేద నిరుపేద ప్రజల, అర్హులైన లబ్ధిదారుల  సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నదని తెలిపారు. ఆ నమ్మకమే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబంభించిందన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగం లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుని వొచ్చి అమలు చేస్తున్నామన్నారు. కొవ్వూరు కి చెందిన లబ్దిదారునికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజురైన రూ.7,50,000 ల చెక్కును మంత్రి తానేటి వనిత అందచేశారు.


కొవ్వూరు నుంచి తాళ్లపూడి కి బదిలీపై వెళ్లి ఎస్ ఐ వెంకట రమణ , కొవ్వూరు రూరల్ ఎస్ ఐ సతీష్ లు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.