చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోరాదని , అటువంటి వారి విషయంలో ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ స్పష్టం చేశారు.


 కొవ్వూరు (ప్రజా అమరావతి) ; 

 


చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోరాదని , అటువంటి వారి విషయంలో ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ స్పష్టం చేశారు.శనివారం  మలకపల్లి  గ్రామంలో పర్యటన అనంతరం  కొవ్వూరు ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేఖరుల సమావేశంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ గారు మాట్లాడుతూ, గెడ్డం శ్రీను మృతి చెందిన ఘటనలు జరిగితే సమాజానికి మంచిది కాద ని అగ్రవర్ణాల వారికి  తెలియ చేస్తు న్నానన్నారు. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోరాదని, భవిష్య త్తు లో అటువంటి వారు ఇబ్బందు లు పడక తప్పదన్నారు. శ్రీను మృతి చెందిన సంఘటన లో విఆర్వో తప్పుడు నివేదిక ఇచ్చా రని, సంబంధించిన తహసీల్దార్ పోలీసులు సరిగ్గా స్పందించలేదని ఈ విషయం పై ఆర్డీవో విచారణ జరిపించాలని సూచించామన్నారు. శ్రీను మృతి పై అనుమానం కలుగు తోందని, శవాన్ని ముట్టుకోకండి , శవ పంచనామా జరిపించాలని గ్రామస్థులు, శ్రీను తల్లిదండ్రులు కోరినట్లు ఆరోపణలు వొచ్చాయ న్నారు. దీనిపై అధికారులు స్పందిం చిన  తీరుని కమిషన్ తప్పుపడు తోందని ఆనంద్ ప్రకాష్ పేర్కొన్నా రు.

మలక పల్లి లో జరిగిన ఘటన పై ఎస్ ఐ తీరుపై డీఎస్పీ తగిన చర్య లు తీసుకోవాలని, లేకపోతే ఈ విష యంలో కమిషన్ స్పందిస్తుందని స్పష్టం చేశారు . ఆర్డీవో, డీఎస్పీ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నా రు. ఈ అంశంపై కొవ్వూరు  ఆర్డీవో ఎస్. మల్లిబాబు,  స్పందిస్తూ, లోపా లు జరిగినట్లు గుర్తించామని విఆర్వో ఇచ్చిన నివేదిక ఫోనులో వివరణ కోరి చార్జెస్ ఫ్రేమ్ చేస్తున్న ట్లు , తహసీల్దార్ పై చర్యలకు కలెక్టర్ కి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు.  డీఎస్పీ బి. శ్రీనాధ్ ఎస్ ఐ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి, శాఖ పరమైన చర్యల కు , ఇంఛార్జి ఆఫీసర్ వేరొకరిని నియమించాలని జిల్లా ఎస్పీ కి నివేదిక సమర్పించడం జరుగుతుం దని తెలిపారు. ఆర్డీవో తో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి భాదితు లకు తప్పకుండా న్యాయం చెయ్య డం జరుగుతుందని తెలిపారు.అంతకుముందు కొవ్వూరు చేరుకున్న చెల్లమ్ ఆనంద్ ప్రకాష్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి  మలకపల్లి చేరుకున్న ఆనంద్  ప్రకాష్ గెడ్డం శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి, అక్కడ నుంచి గెడ్డం శ్రీను మరణించిన ఘటన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీ లించారు.ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.


ఎస్సి కమిషన్ సభ్యుల కొవ్వూరు, మలకపల్లి  పర్యటనలో ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, డిఎస్పీ బి.శ్రీనాధ్, తహసీల్దార్ బి. నాగరాజు నాయక్,  రెవెన్యూ, పోలీసు, గ్రామస్తులు,  తదితరులు పాల్గొన్నారు.