అన్నదాత సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం - రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

 


 అన్నదాత సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం - రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం :-


 రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి - పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి :-


 రైతు పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి - బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి :-


 వ్యవసాయం పై అన్నదాతల్లో మక్కువ పెంచారు -కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ :-


 జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో విడత కింద 4,70,381 మందికి రూ.98.14 కోట్లు :-


 సున్నా వడ్డీ పంట రుణాలు (ఖరీఫ్- 2020 ) కర్నూలు జిల్లాలోని 77,136 మంది రైతు ఖాతాలలో రూ.16.40 కోట్లు పంట రుణాలు వడ్డీ జమ :-


 వైయస్సార్ యంత్ర సేవ పథకం సంబంధించి కర్నూలు జిల్లాలోని 197 రైతు గ్రూపుల ఖాతాలకు రూ.2.52 కోట్లు జమ :-


 జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-


కర్నూలు, అక్టోబర్ 26 (ప్రజా అమరావతి):-


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.


డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు.


స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్కి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి, కెడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ ఎన్ మహాలక్ష్మి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎంకెవి శ్రీనివాసులు, అగ్రికల్చర్ జెడి వరలక్ష్మి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ...రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడో ఏడాది రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా సహాయాన్ని అందించారు అన్నారు. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద రాయితీ జమ చేసి అండగా నిలిచామన్నారు. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం కింద సబ్సిడీ సొమ్ము రైతు పొదుపు సంఘాలకు జమ చేశామన్నారు. దీంతో వ్యవసాయం పై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామాల్లో రైతులు సాగుబడిని పండగ వాతావరణంలో చేపడుతున్నారన్నారు. వాస్తవ సాగుదారులు అందరికీ సాయం అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.


జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ.... జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో విడత కింద 4,70,381 మందికి రూ.98.14 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలు (ఖరీఫ్- 2020 ) కర్నూలు జిల్లాలోని 77,136 మంది రైతు ఖాతాలలో రూ.16.40 కోట్లు పంట రుణాలు వడ్డీ జమ చేశామన్నారు. వైయస్సార్ యంత్ర సేవ పథకం సంబంధించి కర్నూలు జిల్లాలోని 197 రైతు గ్రూపుల ఖాతాలకు రూ.2.52 కోట్లు జమ చేశామన్నారు.


రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి - పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి :-


రైతు సంక్షేమం కోసం నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా సహాయాన్ని వరుసగా మూడో ఏడాది రెండో విడత కూడా నిరాటంకంగా అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఒకే రోజు మూడు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.


రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి - బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి :-


రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారన్నారు. రైతన్నలకు కొండంత అండగా చెప్పినదాని కంటే ముందుగా, మాట ఇచ్చిన దానికంటే మిన్నగా ఏడాదికి రూ.13,500/-ల పెట్టుబడి సాయాన్ని అందించడానికి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా శ్రీకారం చుట్టి వ్యవసాయాన్ని పండుగ చేస్తూ, రైతన్నల గౌరవాన్ని పెంచారన్నారు.


వ్యవసాయం పై అన్నదాతల్లో మక్కువ పెంచారు -కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ :-


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం పై అన్నదాతల్లో మక్కువ పెంచారని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా సాయాన్ని వరసగా మూడో ఏడాది రెండో విడత కూడా అన్నదాత ఖాతాలకు జమ చేసి ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇచ్చిన హామీల కంటే అదనంగా సాయం చేస్తుండడంతో రైతు లోకమంతా జగనన్నకు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.


మెగా చెక్కు పంపిణీ :-


డాక్టర్ వై యస్ ఆర్ రైతు భరోసా పథకం రెండో విడత సంబంధించి కర్నూలు జిల్లాలోని 4,70,381 రైతు కుటుంబాలకు రూ 98.14 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలు (ఖరీఫ్- 2020) 77,136 మందికి రూ.16.40 కోట్లు పంట రుణాలు వడ్డీ జమ, వైయస్సార్ యంత్ర సేవ పథకం సంబంధించి కర్నూలు జిల్లాలోని 197 రైతు గ్రూపుల ఖాతాలకు రూ.2.52 కోట్లు జమ మెగా చెక్కులును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్కి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డిలు రైతులకు అందజేశారు.