కొవ్వూరు (ప్రజా అమరావతి);
'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష రీసర్వే తో వ్యవసాయ భూములు సమగ్ర సర్వే
రోవర్ మిషన్, క్యూజిఎస్ సాఫ్ట్ వేర్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో
భూమిరికార్డుల ఆధునికీకరణతో రాబోయే కాలంలో భూములకు రక్షణ..
.... ఆర్డీవో ఎస్.మల్లిబాబు
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఒక బృహత్తరమైన కార్యక్రమమని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు.
వ్యవసాయ భూములు రీసర్వే పథకం అమల్లో భాగంగా శనివారం ఆర్డీవో కార్యాలయంలో 13 మండలాలకు చెందిన ఎంపిక చేసిన అధికారులకు, సిబ్బందికి ఆర్డీవో సమక్షంలో మాస్టర్ ట్రైనర్ సురేష్ "ఎస్ ఓ పి" పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, ఆధునాతన టెక్నాలజీ వినియోగించిన డ్రోన్ ద్వారా చేస్తున్న వ్యవసాయ భూములు రీసర్వే పనులను దేశంలో ఎక్కడా ఇప్పటివరకు చేపట్టి ఉండలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే జరుగుతుందని, ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో సర్వే నిర్వహించామన్నారు. రాబోయే తరాలు ఇబ్బంది లేకుండా వారి ఆస్తులకు రీ సర్వే ద్వారా భద్రత ఏర్పడుతుందన్నారు. రైతుల భూముల సరిహద్దులు విషయంలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో తోగుమ్మి గ్రామంలో రీసర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు.70 / 80 ఏళ్ల క్రితం సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ల్యాండ్ పార్సెల్ నెంబర్ ఇవ్వడం ద్వారా భూ యజమానులకు చెందిన యాజమాన్యం, పరిమాణం, స్థానం, ప్రాంతం మరియు ఇతర ముఖ్యమైన మరియు సంబంధిత వివరాలను అందులో గుర్తించగల మన్నారు. ఈ సర్వే పూర్తి వివరాలు ద్వారా తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆన్ లైన్ ద్వారా తెలుసుకొనేందుకు ఈ పథకం రక్షగా , దిక్సుచి గా ఉంటుందన్నారు. ఒక్కసారి క్లిక్ చేస్తే తమ భూముల ఎక్కడ ఉన్నాయనే విధంగా ఆన్లైన్ రికార్డును తయారు చేస్తున్నామని ఆర్డీవో పేర్కొన్నారు. ఎలాంటి ఢోకా లేని విధంగా ఆస్తుల వివరాలు భద్రంగా ఉండే విధంగా రికార్డులను ఆధునీకరణ సాధ్యం అవుతుందన్నారు. అంతేగాక పాత పద్ధతిలోగ్రామ కంఠం, హద్దులు, సర్వే రాళ్లు కూడా ఆయా భూముల్లో రీసర్వేలో భాగంగా పాతుతారన్నారు. బండి దారి, గట్లు, పొలాలు హద్దులు వివాదాలు వంటివి గతంలో ఎన్నో తలెత్తేవని, అలాంటి వివాదాలకు నేడు తావు లేకుండా, కోర్ట్ తగాదాలు పరిష్కారం చూపేలా ఎవరి హద్దులు ఎక్కడ ఉన్నాయనే విధంగా సర్వే రాళ్లను పాతటంతో పాటు సాంకేతికంగా రికార్డులను తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ బృహత్తర పథకంలో రెవిన్యూతో పాటు పంచాయితీ వంటి అనేక శాఖల అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పని చెయ్యడం ద్వారా మరింత సచ్ఛిలత తో పారదర్శకంగా రికార్డుల నిర్వహణ సాధ్యం అవుతుంది.
రీసర్వే అంటే ఏమిటి? ఎందుకు చేస్తున్నాము అనే దానిపై స్పష్టత ఉండాలని రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్ సురేష్ పేర్కొన్నారు. ఎస్ ఓ పి (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రాం) పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు. భవిష్యత్తులో జరిగే భూ లావాదేవీలకు రికార్డుల్లో పేర్లు మార్పు చేయాలన్నా ఖచ్చితంగా పని అయ్యే విధంగా సాంకేతికంగా అభివృద్ధి రీసర్వే చేసి రికార్డు చేసే విధంలో సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. ఖచ్చితత్వం తో వేగంగా పూర్తి చేయాలనే డ్రోన్ ద్వారా రీసర్వే చేసేందుకు సిబ్బందికి శిక్షణ అందిస్తున్న ట్లు పేర్కొన్నారు. రెవెన్యూ భూ చట్టాలపై అవగాహన, నాలెడ్జి, చురుగ్గా వ్యవహరించే శైలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లో ప్రాధమిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసిల్దార్ లు, ఆయా మండలంలోని బెస్ట్ విఆర్వో లు, గ్రామ సర్వేయర్లు, రెవిన్యూ ఇన్ స్పెక్టర్ లు ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇక్కడ పొందిన శిక్షణ తరగతుల వివరాలు మీ మీ మండల స్థాయిలో ఆచరణలో పెట్టాల్సిన భాద్యత తీసుకుని, పారదర్శకంగా రీసర్వే పూర్తి చేయాలని సూచించారు.
శిక్షణా కార్యక్రమంలో మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసిల్దార్ లు, ఆయా మండలంలోని బెస్ట్ విఆర్వో లు, గ్రామ సర్వేయర్లు, రెవిన్యూ ఇన్ స్పెక్టర్ లు ఒక్కొక్కరు చొప్పున హాజరయ్యారు.
addComments
Post a Comment