ఆసరా ఉత్సవాలలో రామిరెడ్డి, కాకాణి

 *ఆసరా ఉత్సవాలలో రామిరెడ్డి, కాకాణి


*


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), కావలి నియోజకవర్గం, దగదర్తి మండల కేంద్రంలో అత్యంత ఆడంబరంగా జరిగిన "వై.యస్.ఆర్. ఆసరా" ఉత్సవాలలో స్థానిక కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


సభా ఆవరణలో మహిళలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపారాలకు సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించి, మహిళలతో ముచ్చటించిన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , కాకాణి గోవర్ధన్ రెడ్డి .


"వై.యస్.ఆర్.ఆసరా" అందించినందుకు కృతజ్ఞతాభావంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన సంఘ బంధాల మహిళలు.


"వైయస్సార్ ఆసరా" రెండో విడత చెక్కును, బ్యాంకు లింకేజీ లోన్లకు సంబంధించిన చెక్కులను సంఘ బంధాల మహిళలకు అందించిన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , కాకాణి గోవర్ధన్ రెడ్డి .


స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా చెత్త తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి.


పై కార్యక్రమంలో ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి , దగదర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తాళూరి ప్రసాద్ నాయుడు , కావలి ఆర్.డి. ఓ. శీన నాయక్ , జెడ్పిటిసి సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.