దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి

 ఇంద్రకలాద్రి (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం  లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి వర్యులు శ్రీ మేకతోటి సుచరిత.

అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ.


దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి


.


దసరా వేడుకలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషం...

అమ్మవారు  మహిళా శక్తి స్వరూపిణిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నారని అన్నారు.


రాష్ట్ర ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరారు.


ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి  కూడా మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.


మంత్రివర్గం నుంచి పంచాయితీ వరకు మహిళలకు 50 శాతం వరకు పదవులను కేటాయించారన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యథాతథంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రభుత్వం తరఫున దుర్గమ్మను కోరుకున్నానన్నారు.


మూడు వేల మందికి పైగా పోలీసు సిబ్బంది, వెయ్యి మందికి పైగా ఇతర శాఖల సిబ్బందితో దసరా ఉత్సవాలను ఘనంగా  నిర్వహిస్తున్నామన్నారు.


కరోనా, లాక్ డౌన్ కారణంగా  గత రెండు సంవత్సరాలుగా దసరా ఉత్సవాలను సంతృప్తికరంగా నిర్ణయించుకోలేకపోయామని మంత్రి అన్నారు.


ఈ ఏడాది భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వీయరక్షణతో పాటు భౌతకదూరం పాటిస్తూ దుర్గమ్మను దర్శించుకోవడం అభినందనీయమన్నారు.


అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నానని రాష్ట్ర హోం మంత్రి వర్యులు మేకతోటి సుచరిత అన్నారు.Comments