భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.

 ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి;


        

భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.రేపటి నుండి అనగా గురువారం నుండి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి  ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. వినాయక టెంపుల్ నుండి అమ్మవారి దర్శనం వరకు చేసిన క్యూలైన్లను పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు.క్యూలైన్లలో భక్తులను చేసిన ఏర్పాట్లను పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాటు చేసినట్లు మంత్రి అన్నారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముఖ్యంగా త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దేందుకు  పర్యవేక్షించడం జరుగుతుందని మంత్రి అన్నారు. 


ఈ పర్యటనలో మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్..

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image