ఏపీలోని ప్రాంతీయ పార్టీలు దిగజారిపోయాయి : బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు (ప్రజా అమరావతి)
: ప్రధాని మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ప్రధాన సేవకుడుగా దేశానికి సేవలు అందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 7 సంవత్సరాలు పూరైన అలుపెరగని ధీరుడుగా అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని తెలిపారు. రాజీలేని దేశ రక్షణ, పారిశ్రామికపరంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు దిగజారి పోయాయని విమర్శించారు. భూతులు మాట్లాడం, రౌడీయిజం చేయడమే పాలనగా మారిందన్నారు. ప్రజా సమస్యలపైన ఉద్యమం చేసిన, ప్రశ్నించిన అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో నియంత పాలన సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు తగిన బుద్దిచెపుతారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
addComments
Post a Comment