గుంటూరు జిల్లా.
మంగళగిరి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ బి సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆదివారం మంగళగిరి నృసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి కామెంట్స్.....
పేదవారి సంక్షేమంకోసం యాగాన్ని తలపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ప్రతిపక్ష నాయకులు ఆ యాగానికి విఘాతాలు కలిగించెందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
పేదవారు పేదవారిగానే ఉన్నప్పుడే పాలకుడి మాట వింటారనేది చంద్రబాబు ఉద్దేశం. అందుకే ఆయన పాలనాకాలంలో పేదలను విస్మరించారు.
పేదవాడు అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తూ పేద వారిని ఉద్దరించాలని లక్ష్యంతో నేడు పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకం పై డివిజినల్ బెంచిలో సరైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .
addComments
Post a Comment