స్వచ్ఛ నెల్లూరు సాధనే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు,

 


నెల్లూరు, అక్టోబర్ 2 (ప్రజా అమరావతి):


   స్వచ్ఛ నెల్లూరు సాధనే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు,


పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు సూచించారు. శనివారం ఉదయం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమ ప్రారంభానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్  కార్యక్రమంలో భాగస్వాములై  నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో కూడా నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు జెడ్ పి టి సి లు, సర్పంచులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని... మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా నెల్లూరు లో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు  పేర్కొన్నారు. నెల్లూరుకు 125 చెత్త సేకరణ  వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలోనే వీటి ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా  ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయకుండా బాధ్యతగా ప్రవర్తిస్తే మన నెల్లూరు నగరం స్వచ్ఛమైన నగరంగా, కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నగరంలో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు కఠిన చర్యలు చేపట్టామని, వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా జ్యూట్ బ్యాగులు, కాటన్ సంచులను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్వచ్ఛ నెల్లూరు కార్యక్రమంలో భాగంగా నెలరోజుల ప్రణాళికకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరె, డిఎఫ్ఓ శ్రీ షణ్ముఖ కుమార్, అడిషనల్ కమిషనర్ శ్రీ ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్ శ్రీ వెంకటరమణ,  మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image