జ్వరాలతో బాధ పడుతున్న ప్రజలుకొవ్వూరు  (ప్రజా అమరావతి);


జ్వరాలతో బాధ పడుతున్న ప్రజలు   


ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలు అందించి ప్రజల ప్రా ణాలను కాపాడతామని రాష్ట్ర స్త్రీ శిశు సం క్షేమ శాఖ మంత్రి డా.తానే టి వనిత అన్నారు.


 కొవ్వూరు 1వ వార్డులో శ్రీరామ కాలనీలో బుధవారం మంత్రి  శ్రీరామ్ కాలనీ లో ప్రతీ ఇంటికి వెళ్లి బాధితులను పరామ ర్శించి, బాధి తులతో మాట్లాడి భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి  వనిత మాట్లాడుతూ, శ్రీరామ్ కాలనీలో కొందరు జ్వరాలతో, తీవ్ర కాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిస్తే వెంటనే వైద్యులను అప్రమత్తం చేశామన్నారు.

ప్రతీ ఇంటికీ వెళ్లి బాధితులను పరా మర్శించి భరోసా కల్పించామన్నా రు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బం దులు వచ్చినా అధికారులకు తెలియజేస్తే వెంటనే స్పందించి తక్షణమే సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కొందరికి తీవ్ర జ్వరం వొచ్చి తరువాత తీవ్రంగా జాయింట్ నొప్పులు, కళ్ళు తిరగడం వంటి నొప్పుల లక్షణాలు  వున్నట్లు తెలిస్తే ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి చేరాలని తెలిపారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 


మంత్రి తానేటి వనిత చొరవ తో  ఆంబులెన్స్ ను ఏర్పాటు చేసిముగ్గురు బాధితులను ఆసుపత్రి కి తరలించారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అ న్నారు. ప్రస్తుతం 7 గురు బాధితులను ఈ రోజు హాస్పిటల్ కీ తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 


మంత్రి వెంట కొవ్వురు ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, డిప్యూటీ డి. ఎం. హెచ్ ఓ, పి. రామగురు రెడ్డి, వైద్య నిపుణులు, ఎస్. ధర్మరాజు, బి. శ్రీనివాస్, నోడల్ అధికారి, పి. డి. వర్మ, మెడికల్ అధికారులు కె. సత్యవతి, సి. హెచ్. రాజీవ్ కౌన్సిల ర్ లు,అక్షయ పాత్ర శ్రీనివాస్ రవీం ద్ర, ఆర్. భాస్కర రావు, కె. రమేష్, స్థానిక ప్రజాప్ర తినిధులు, తదితరు లు పాల్గొన్నారు.