*రూ.25 కోట్లతో నిర్మించిన చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి*
*బాలల ఆరోగ్య వరప్రదాయని కానున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఇక నుండి అందుబాటులోనికి..
..*
*ఈ నెల 12 వతేది నుండి ఓపి సేవలు ప్రారంభం...*
*డిసెంబర్ మొదటి వారం నుండి శస్త్ర చికిత్సలు మొదలు*
తిరుపతి, అక్టోబర్ 11 (ప్రజా అమరావతి):
బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుపత్రిని గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి లోని బర్డ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభించారు....
అనంతరం ఆసుపత్రి లో వైద్య సేవలు అం దించే వివిద విభాగాల ను గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు పరిశీలించారు..
ఈ కార్యక్రమంలో గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు గౌ. రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు గౌతం రెడ్డి, గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కె. నారాయణస్వామి, గౌ. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌ.రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసులు, గౌ. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,గౌ. రాజంపేట, చిత్తూరు మరియు తిరుపతి ఎంపి లు పి.వి. మిథున్ రెడ్డి, ఎన్. రెడ్డెప్ప, ఎం.గురుమూర్తి లు,
టి టి డి బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, ఎం ఎల్ సి లు బి.కిశోర్ బాబు, తిప్పేస్వామిలు, తిరుపతి నగర మేయర్ శిరీష, చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పలమనేరు, పీలేరు, తంబళ్ళపల్లి, పూతలపట్టు, రాజంపేట, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, వెంకటేగౌడ, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి, ఎం.ఎస్.బాబు, మేడా మల్లికార్జునరెడ్డిలు, సిఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి, సిఎం అడిషనల్ పిఎస్ కె.నాగేశ్వరరెడ్డి, సిఎంఓ స్పెషల్ సెక్రెటరీ హరికృష్ణ, జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష పిఎస్,అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణాటాటా,జెసి (రెవెన్యూ) పి.రాజా బాబు,జే ఈ ఓ వీర బ్రహ్మం,సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి,శ్రీ పద్మా వతి చిన్నపిల్లల హృదయాలయ ఆసు పత్రి డైరెక్టర్ శ్రీనాథరెడ్డి, బర్డ్స్ హాస్పిటల్ స్పెషల్ ఆఫీసర్ రెడ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్స చేసేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలన్న దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి సత్సంకల్పాన్ని సాకారం చేస్తూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.
టిటిడి వారి సౌజన్యంతో చిన్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయుటకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించింది.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి లేకుండా, ఈ శస్త్ర చికిత్సలు చేయించే కొనే ఆర్థిక స్థోమత లేని నిరుపేద తల్లిదండ్రుల చిన్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించాలని ప్రభు త్వం సంకల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య నిపుణులతో సంప్రదిం చి టిటిడి వారి సౌజ న్యం తో గుండె సంబం ధిత వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల కు రాష్ట్ర ప్రభుత్వమే డా. వై.ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద ఈ ఆసుపత్రి నందు పూర్తి ఉచితంగా వైద్య సేవలను అందిం చడం జరుగుతుంది..
ఈ నెల 12 వతేది నుండి ఓపి సేవలు ప్రారంభం కాగా... డిసెంబర్ మొదటి వారం నుండి శస్త్ర చికిత్సలు మొదలు కానున్నాయి...
ఈ ఆసుపత్రిలో పీడియాట్రిక్ కార్డియాలజీ మరియు పీడియాట్రిక్ కార్డియో తోరాసిక్ సర్జరి విభాగానికి సంబంధించి వైద్యులను నియమించడం జరిగింది..
50 పడకలు, 25 పడకల ఐసియు సామర్థ్యంతో మరియు 3 లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, అడ్వాన్స్ కాత్ ల్యాబ్, 3 డి కార్డియో ఎకోగ్రఫీ యంత్రాలు, 12 చానల్ ఈసిజి మెషిన్, పోర్టబుల్ డి2డి ఏకొ కలర్ డాప్లర్ మెషిన్ లతో అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అందిస్తారు...
addComments
Post a Comment