*కసుమూరులో కాకాణి ప్రత్యేక ప్రార్థనలు*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గాలో నిర్వహించే అతి ప్రధాన కార్యక్రమమైన కంబల్ ఫాతెహ (దుప్పట్ల పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని ప్రార్థిస్తున్నా.
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అల్లాహ్ దయతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకుంటున్నా.
దక్షిణ భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గాలో జరిగే కంబల్ ఫాతేహ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొనడం నాకు ఆనవాయితీ.
బద్వేల్ ఉపఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్నా, కంబల్ ఫాతేహలో పాల్గొనడానికి ఈరోజు కసుమూరు దర్గాకు వచ్చా.
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తానయ్య దర్గా ఉండటం నా పూర్వజన్మ సుకృతం.
కసుమూరు దర్గాకు దేశ, విదేశాల నుండి తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
కసుమూరు దర్గా ను సందర్శించే భక్తులకు వసతి గృహాలు, స్నానపు ఘట్టాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి.
కసుమూరు దర్గాలో అన్ని వసతులు కల్పించడానికి 3కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
ప్రభుత్వంకు పంపిన ప్రతిపాదనలను వీలైనంత త్వరగా ఆమోదముద్ర వేయించి, పనులు ప్రారంభించి, పూర్తి చేస్తాం.
దర్గాలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి, స్థానిక ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దర్గా సందర్శనార్థం విచ్చేసే, భక్తులకు వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం.
కోవిడ్ నేపథ్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే కంబల్ ఫాతేహ వేడుకలకు, గంధమహోత్సవానికి సహకరించిన భక్తులకు, స్థానిక ప్రజలకు, దర్గా ముజావర్లకు నా ధన్యవాదాలు.
కసుమూరు మస్తానయ్య దర్గా యొక్క పవిత్రతను కాపాడుతూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటాం.
addComments
Post a Comment