సీఎం జగన్మోహనరెడ్డిని తిట్టే స్థాయి పట్టాభికి ఎక్కడుంది- సీఎం జగన్మోహనరెడ్డిని తిట్టే స్థాయి పట్టాభికి ఎక్కడుంది 


- మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి ఆగ్రహం గుడివాడ, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): సీఎం జగన్మోహనరెడ్డిని తిట్టగలిగే స్థాయి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్న పట్టాభికి ఎక్కడుందని మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడ పట్టణం శరత్ థియేటర్లోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. అధికారం కోల్పోయిన నాటి నుండి టీడీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తూ వస్తున్నారన్నారు. తాజాగా పార్టీ నాయకులతో ఇష్టానుసారంగా దుర్భాషలాడిస్తూ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. గత రెండేళ్ళుగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి సీఎం జగన్మోహనరెడ్డి పాటుపడుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని నోటికి వచ్చినట్టు మాట్లాడడంపై మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పట్టాభి వెంటనే సీఎం జగన్మోహనరెడ్డికి క్షమాపణలు చెప్పాలన్నారు. లేకుంటే రానున్న కాలంలో మహిళలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవాలని మాదాసు వెంకటలక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి  హనుమంతరావు, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి, నాయకులు తులిమిల్లి యేషయ్య, నైనవరపు శేషుబాబు, తోట రాజేష్, షేక్ బాజీ, మెండా చంద్రపాల్, మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్ తదితరులు పాల్గొన్నారు.

Comments