భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం

 విజయవాడ ,అక్టోబర్ 7 (ప్రజా అమరావతి):



ఇంద్రకీలాద్రి పై స్వర్ణకవచాలంకృత అలంకారంలో ఉన్న దుర్గమ్మ ను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి


*మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్*


ఇంద్రకీలాద్రిపై తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవములను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.


భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం 



క్యూలైన్లు, అన్న ప్రసాదాల పంపిణీ,కేశఖండనశాల,జల్లు స్నానాలు, శానిటేషన్ తదితర విషయాల్లో  అన్ని డిపార్ట్ మెంట్ల సహకారంతో సమన్వయం చేశాం 


ఈ నెల 12న మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు 


కరోనా నిబంధనల నడుమ అమ్మవారిని దర్శించుకోవాలి


ఐదు క్యూ లైన్ల ద్వారా భక్తులకు అమ్మ వారి దర్శనం కల్పించాం.


ప్రత్యేక కుంకుమార్చనలు తోపాటు ,పరోక్ష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


గత దసరాలో కొండచరియలు విరిగిపడ్డాయి..అవన్నింటినీ సెక్యూర్ చేశాం 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. 75 కోట్లు ఇంద్రకీలాద్రి అభివృద్ధి కి కేటాయించారు 


రాబోయే రోజుల్లో తిరుమల తర్వాత రెండో దేవాలయంగా దుర్గగుడి ఉండేలా అభివృద్ధి చేపడుతున్నాం

Comments