మహిళలు సంతోషంగా మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలని,



తాళ్లపూడి  (అన్నదేవరపేట) (ప్రజా అమరావతి); 

 



మహిళలు సంతోషంగా మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలని,


మహిళా సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


శుక్రవారం స్థానిక అన్నదేవరపేట గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీమీ కుటుంబాల అభివృద్ధి కి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. . 


తాళ్లపూడి మండలం లో 10982 మంది లబ్దిదారులకు రూ.10 కోట్ల 85 లక్షలు వైఎస్సార్ ఆసరా రెండో విడత ప్రయోజనం లబ్దిదారుల ఖాతాలో జమ చెయ్యడం జరిగిందని, అన్నదేవరపేట గ్రామంలో 190 గ్రూప్ లకు చెందిన 1876 మంది మహిళల ఖాతాలో రూ.2 కోట్ల 13 లక్షలు, 50 వేలు ప్రయోజనం చేకూర్చినట్లు మంత్రి  పేర్కొన్నారు. అనంతరం ఈ రోజు తాడిపూడి పంచాయతీ లో 49 గ్రూప్ లకు రూ.59.02 లక్షలు, పోచవరం లో 70 గ్రూపు లకు రూ.83.35 లక్షలు, తాళ్లపూడి లో 137 గ్రూపుల కు రూ.1 కోటి 20 లక్షలు, ప్రక్కిలంక పంచాయతీ 96 సంఘాలకు రూ. కోటి 17 లక్షలు వైఎస్సార్ ఆసరా రెండో విడత మొత్తాలను లబ్దిదారుల ఖాతాకు చెల్లింపు చేస్తున్న ట్లు తెలిపారు. 


జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ని మహిళలకు రూ.618 కోట్లు , పట్టణ ప్రాంతాల్లో ని వారి ఖాతాలకు రూ.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నదని పీడీ డిఆర్డీఏ  శ్రీనివాసరావు పేర్కొన్నారు. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ఆరోజుల్లో జమచేసే సొమ్ము ముందుగానే ఆ  మొత్తాన్ని ఈ రోజే బ్యాంకు కి జమచేస్తున్నామని తెలిపారు.


గ్రామ సర్పంచ్ ఏలిపే సుధారాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో  తాళ్లపూడి జెడ్పిటిసి/ జిల్లా వైస్ ఛైర్మన్ పోసిన శ్రీలేఖ,  ఎంపిపి జొన్నకూటి పోసిరాజు,  గజ్జరం ఎంపీటీసీ  గుంటు చిన్నాబ్బాయి, తాళ్లపూడి మండల ఎఎంసి వి.శ్రీహరి, స్థానిక నాయకులు పోసిన శ్రీకృష్ణ దేవరాయలు,  డిఆర్డీఏ పీడీ  శ్రీనివాస్, తాహసీల్దార్ శాంతి,  ఎంపీడీఓ రాజశేఖర్,  తదితరులు పాల్గొన్నారు.



Comments