వాల్మీకి మహర్షి జాతికే ఆదర్శం అనంతపురం పార్లమెంటు సభ్యుడు
వాల్మీకి మహర్షి మానవజాతికి ఆదర్శప్రాయుడని అనంతపురం ఎమ్మెల్యే
అనంతపురం, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి);
వాల్మీకి మహర్షి మానవజాతికి ఆదర్శప్రాయుడని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సంయుక్తంగా కొనియాడారు . ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ, జెడ్పి చైర్ పర్సన్ గిరి జమ్మ , జాయింట్ కలెక్టర్ రెవెన్యూ నిశాంత్ కుమార్ వాల్మీకి జయంతిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని పాత ఊరు విద్యుత్ కార్యాలయం సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా మీడియాతో అనంతపురం ఎంపీమాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణ గ్రంథం ప్రతి మానవుడికి ఆచరణీయ మన్నారు. ముఖ్యంగా అన్నదమ్ముల ఆప్యాయత ,తండ్రీకొడుకుల ప్రేమానురాగాలు, బాంధవ్యాలు, సాంప్రదాయాలు, మనుషుల్లో ఎలా ఉండాలో రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేశారన్నారు. ఈరోజు రాష్ట్రస్థాయి వేడుకలు నగర శివారులోని శిల్పారామంలో పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి మహర్షి యావత్ జాతికి కే ఆదర్శ మని అన్నారు. వాల్మీకి మహర్షి స్ఫూర్తితో నాగరిక జీవనం సాగించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకుల సంక్షేమానికి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు వాటిని సద్వినియోగం తోనే బోయ ల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో విద్యతోనే సామాజిక చైతన్యం నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, వాల్మీకి సంఘాల నాయకులు వీరాంజనేయులు, బీసీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment