రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల కొవ్వూరు (ప్రజా అమరావతి);


గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల వివరాలతో ఈనెల 20 న ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయాలని  రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల


మేరకు  కొవ్వూరు 23వార్డు కి సంబంధించిన  బుధవారం ముసాయిదా  నోటిఫికేషన్ జారీ చెయ్యడం జరిగిందని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్. కె.టి.సుధాకర్  పేర్కొన్నారు. బుధవారం స్థానిక కమిషనర్ వారి కార్యాలయంలో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసారు. 


 ఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 23 వ వార్డు కౌన్సిలర్ మృతి చెందడంతో ఎన్నికల నిర్వహణ కోసం మునిసిపల్ కార్యాలయ నోటీస్ బోర్డ్ తో పాటు అన్ని ప్ర భుత్వ కార్యాలయాల్లో నోటిస్ బోర్డుల్లో    ముసాయిదా నోటిఫికేషన్ ప్రదర్శించడానికి ఏర్పాటు చేశామన్నారు.


   వీటిపై ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 23న తుది నోటిఫికేషన్‌ ఇవ్వాలని స్పష్టం చేసిన దృష్ట్యా  ఈ నెల 22 వ తేదీ శుక్రవారం  ఉదయం 10.30 గంటలకు మునిసిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సుధాకర్ తెలిపారు.  ఈ సమావేశంలో పోలింగ్ స్టేషన్లలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలిజేయాలని కోరతామన్నారు. అభ్యంతరాలు ఏమి లేనిచో ఈ నెల 23 వ తేదీన ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు తుది పబ్లికేషన్ ఇవ్వబడునని తెలిపారు.
Comments