రైతుల కళ్లల్లో ముందే దీపావళి చూడాలని..


అమరావతి (ప్రజా అమరావతి);


వైయస్‌ఆర్‌ రైతు భరోసా పీఎం కిసాన్, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్‌ఆర్‌ యంత్రసేవా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి క్యాంప్‌ కార్యాలయం నుంచి జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....: 


ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిండు మనస్సుతో వ్యవసాయానికి దన్నుగా, రైతులకు సంబంధించి వందకు వంద శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వచ్చామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 


రైతుల కళ్లల్లో ముందే దీపావళి చూడాలని..


రైతు పక్షపపాత ప్రభుత్వంగా ఈ రోజు రైతు భరోసా, వైయస్సార్‌ సున్నావడ్డీ, వైయస్సార్‌ యంత్రసేవా పథకం ఈ మూడింటికి సంబంధించి రూ.2190 కోట్ల లబ్దిని రైతుల కళ్లల్లో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని విడుదల చేస్తున్నాం. 


ఇందులో భాగంగా రైతు భరోసా ద్వారా దాదాపు 50 లక్షల మంది పై చిలుకు రైతు కుటుంబాలకు వరుసగా మూడో సంవత్సరం రెండోవిడత కింద అక్టోబరులో ఇవ్వాల్సిన రూ.2052 కోట్లు ఈ రోజు జమ చేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా కింద రెండో విడత ఆగష్టులో విడుదల చేసిన రూ.972 కోట్లు కలుపుకుని ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో అక్షరాలా రైతు భరోసాకు రూ.2052 కోట్లు రెండో విడతగా మూడో సంవత్సరం అందిస్తున్నాం. 


*కౌలు రైతులకు సైతం రైతు భరోసా..*

ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకానికి మాత్రమే దాదాపుగా రూ.18,777 కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేస్తున్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు కూడా ప్రతి ఏటా రూ.13,500 రైతుభరోసా కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.


*వైయస్సార్‌ సున్నా వడ్డీ...* 

వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం కింద 6.67లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈ రోజు రూ.112 కోట్ల 70 లక్షల రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా  బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా రూ.1లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు  వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని  తిరిగి వారి ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తున్నాం.

 

దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి కేవలం సున్నా వడ్డీ కింద రూ.1674 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇందులో దాదాపుగా రూ.382 కోట్లు వైయస్సార్‌ సున్నావడ్డీ కింద చెల్లించాం. ఇప్పుడు మరో రూ.112 కోట్ల వడ్డీ రాయితీ ఇస్తున్నాం. ఇక మిగిలినది  గత ప్రభుత్వం సున్నా వడ్డీ కింద బకాయిలుగా పెట్టి, ఎగ్గొట్టిన రూ.1180 కోట్లు కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతో చెల్లించాం.


*బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు....* 

రైతులకు మరింత సులభంగా పంట రుణాలు అందించేందుకు వీలుగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఇందులో 9160 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లును కూడా బ్యాంకింగ్‌ సేవలు రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీకేల్లో కూర్చొబెట్టాం. 

మిగిలిన ఆర్బీకేల్లో కూడా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.


కౌలు రైతులుతో సహా రైతులందరికీ కూడా బ్యాంక్‌ లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంట రుణాలు అందుకునేందుకు ఈ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు ఆర్బీకేల్లో ఎంతో ఉపయోగపడతాయి. 


*కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు...*

వైయస్సార్‌ రైతు భరోసా, సున్నావడ్డీతో పాటు వైయస్సార్‌  యంత్రసేవా పథకం కింద ఈ రోజు 1720  రైతు గ్రూపులకు  అంటే ఒక్కోక్క కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని కూడా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. రైతులకు సరసమైనఅద్దెకే, రైతులు నిర్దేశించిన అద్దెకే ఈ యంత్రసేవలు వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. 


రాష్ట్రవ్యాప్తంగా రూ. 2134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా గ్రామ స్ధాయిలో ఈ 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్టాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ( సీహెచ్‌సీలను) అందుబాటులోకి తీసుకువస్తున్నాం. 


*29 నెలల్లో గణనీయమైన మార్పులు..*

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే... ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తీసుకొచ్చామన్నది.. ఒక్కసారి ఈ సందర్భంగా  మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.  

నాలుగు మాటల్లో చెప్పాలంటే... ఈ 29 నెలల్లో 

దేవుడి దయతో ఎలాంటి మార్పులు జరిగాయని ఆలోచన చేస్తే...


*కరువుసీమలో సైతం నీరు పుష్కలం*

 వాతావరణం అనుకూలించి కరువుసీమ సైతం ఈరోజు నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. రైతుకు ఇంతకముందు కరువు, కాటకాలు మాత్రమే తెలిసిన పరిస్థితులు నుంచి ఈసారి కరోనా కూడా సవాల్‌ విసిరింది.  ఇలాంటి సమయంలో కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వమిది.

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన  బకాయిలును సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం. 


*మార్కెటింగ్‌ పై ప్రత్యేక దృష్టి..*

వ్యవస్ధలను ఎక్కడికక్కడ సరిదిద్దుకుంటూ మార్కెటింగ్‌ మీద విపరీతమైన దృష్టి పెట్టాం. రైతు నష్టపోకూడదని చెప్పి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ కూడా తీసుకురావడం జరిగింది. మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ ఫండ్‌ ఏ స్ధాయిలో పనిచేస్తుందంటే.. కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో పొగాకురైతులు ఇబ్బంది పడుతుంటే... పొగాకు కొనుగోళ్లులో సైతం జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిల్చాం. 


*జే ఎఫ్‌ కెన్నడీ ఏమన్నారంటే...* 

ఎక్కడైనా కూడా ఏ దేశంలోనైనా కూడా రైతు తాను పండించడానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్‌గా కొనుగోలు చేసి, తాను పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు మాత్రం హోల్‌సేల్‌గా అమ్మే పరిస్ధితే ఉంటుందని చెప్పి సాక్షాత్తూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ జే ఎఫ్‌ కెన్నడీ అప్పట్లో ప్రపంచం గురించి, రైతులు గురించి చెప్పిన మాటలు.. ఈ రోజు మనం ఒక్కసారి గమనించినట్లయితే మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించి ఇదే పరిస్థితులు ఉన్నాయి.


*ఆర్బీకేలు వన్‌ స్టాప్‌ సెంటర్లు* 

వాటిని మారుస్తూ... ఈ రోజు మన గ్రామంలోనే మన కళ్లెదుటనే రైతు భరోసా కేంద్రాలను వన్‌ స్టాప్‌ సెంటర్లగా రైతుకు సంబంధించిన ప్రతి అవసరం కూడా ఏకంగా నాణ్యతతో కూడిన గ్యారంటీ ఇస్తూ విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ సరఫరా చేయడమే కాకుండా రైతులకు అందరికీ కూడా తగు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయి పట్టుకుని నడిపించే ఒక గొప్ప వ్యవస్దను ఆర్బీకేల రూపంలో మన గ్రామంలోనే తీసుకువచ్చాం. 


*వ్యవసాయసలహామండళ్లు...* 

వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్బీకే స్ధాయి, మండల స్ధాయి, జిల్లా స్ధాయి, రాష్ట్ర స్ధాయి అని నాలుగు అంచెలుగా ఏర్పాటు చేశాం. నెలలో ప్రతి మొదటి శుక్రవారం ఆర్బీకే స్ధాయిలోనూ సమావేశం జరిగేటట్టుగా, నెలలో రెండో శుక్రవారం మండల స్ధాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్ధాయిలో కలెక్టర్లు ఆధ్వరంలో మూడో మీటింగ్‌ జిల్లా అగ్రికల్చర్‌ అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సమావేశంలో సూచనలు, సలహాలు కొన్ని కలెక్టర్లు స్ధాయిలో పరిష్కరించి మిగిలినవన్నీ ఆ విభాగాధిపతులకు, వ్యవసాయశాఖ కార్యదర్శికి పంపించి పరిష్కరించాలి. రైతులు ఏ పంటలు వేయాలి, రైతులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందాలి, ఆర్బీకేలలో పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా మెరుగుపర్చాలి అని చెప్పి రియల్‌ టైం సలహాలు, సూచనలతో మార్పులు చేసుకుంటూ అడుగులు ముందు వేస్తున్న గొప్ప వ్యవస్ధ ఈరోజు గ్రామస్దాయిలోనే అందుబాటులోకి వచ్చింది. 


*ఇ– క్రాపింగ్‌....* 

ఇ– క్రాపింగ్‌ అన్నది ప్రతి రైతుకు, ప్రతి పంటకు ఆర్బీకేలలో నమోదు చేసుకోవడం ద్వారా పంటలబీమా,  పంట రుణాలపై సున్నా వడ్డీ, పంట కొనుగోళ్లు ఇవన్నీ కూడా పారదర్శకంగా, లబ్దిదారులు ఎవరనేది గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల్లో జాబితా పెట్టి,  సోషల్‌ ఆడిట్‌ చేసి, ధైర్యంగా ఎటువంటి అవకతవకలకు తావే లేకుండా చేస్తున్నాం.  ఇ– క్రాపింగ్‌ ద్వారా ప్రతి పథకాన్ని అనుసంధానం చేసే గొప్ప మార్పు ఈ రోజు గ్రామ స్ధాయిలో జరుగుతుంది. 


కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుంది. వీటి ద్వారా వ్యవసాయ యంత్రీకరణ మొత్తం కూడా గ్రామస్ధాయిలోకే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఖరీదైన పరికరాలను మండల స్దాయిలోకి అందుబాటులోకి తీసుకువచ్చి, యంత్రీకరణ ద్వారా వ్యవసాయం మెరుగుపరుస్తున్నాం. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలా ఆర్బీకేల ద్వారా అనుసంధానం చేస్తున్నాం.


ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలో అగ్రికల్చర్‌అసిస్టెంట్, యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌, ఆక్వా పంటలు సాగుచేసేచోట ఆక్వా అసిస్టెంట్లు కూడా  అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. 


*సహకార వ్యవస్ధ బలోపేతం...*

సహకార వ్యవస్ధలో పీఏసీ నుంచి ఆప్కాబ్‌ వరకు కూడా అన్నింటినీ పూర్తిగా ఆధునీకరిస్తున్నాం. అన్నింట్లో కంప్యూటరీకరణ జరుగుతుంది. సహకార వ్యవస్ధలో హెచ్‌ఆర్‌ వ్యవస్ధ కూడా తీసుకొచ్చే విప్లవాత్మకమైన మార్పులు కూడా జరుగుతున్నాయి. 


ఈ రోజు ఆర్బీకే స్ధాయిలోనే సీఎం యాప్‌ అంటే కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. దాని ద్వారా ఆర్బీకే పరిధిలో వ్యవసాయ ధరలు ఎక్కడైనా కూడా బాగాలేని పరిస్థితి, రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అప్రమత్తమై జాయింట్‌ కలెక్టర్‌కు, మార్కెటింగ్‌ శాఖకు సమాచారం ఇస్తారు. వెంటనే ప్రభుత్వం ధరల స్ధిరీకరణ నిధి ద్వారా రైతన్నను ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేసే స్ధాయిలోకి ఆర్బీకేలను బలోపేతం చేశాం.


*కేంద్రం పరిధిలో లేని పంటలకూ ఎంఎస్‌పీ....* 

దీని ద్వారా వ్యవసాయ ధరలు బాగాలేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుంటుంది.  ఈరోజు ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు  ఎంఎస్‌పీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా  కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలకు కూడా రైతన్నలకు కనీస గిట్టుబాటు ధర అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి ఆర్బీకేలలో పోస్టర్లను పెట్టాం. రైతులకు ఫలానా రేటు కన్నా ధర పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పే పరిస్థితి గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల్లోనే ఉంది. 


*మార్కెటింగ్‌ శాఖలో నాడు–నేడు*

కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు మంజూరు చేస్తూ... మార్కెటింగ్‌ వ్యవస్ధలో ఏఎంసీలను కూడా ఆధునీకరణ చేస్తున్నాం. వాటిలో కూడా నాడు–నేడు తీసుకువచ్చి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. 


*కల్తీ నివారణ పై ప్రత్యేక దృష్టి....* 

కల్తీ నివారణ మీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్లుగా గతంలో ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేదు. మన ఆర్బీకేలల్లో నాణ్యతతో కూడిన విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫెస్టిలైజర్స్‌ సరఫరా చేస్తూ... వాటికి ప్రభుత్వమే కచ్చితంగా గ్యారంటీ ఇస్తుందని భరోసా కల్పిస్తున్నాం. అంతే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు ఎక్కడైనా కూడా అమ్మనీయకూడదని తపనపడుతూ ఎస్పీలను, కలెక్టర్లను ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇలా ప్రతి అడుగులోనూ రైతులకు నష్టం జరగకూడదని తపన పడుతున్న ప్రభుత్వం మనదే. 


*పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌....* 

రాష్ట్రంలో దాదాపు 18.7 లక్షల మంది రైతులకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపుగా రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇవి కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసి పోయిన మరో రూ.10వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన బకాయిలను సైతం చిరునవ్వుతో మన ప్రభుత్వమే కట్టింది.  


నాణ్యమైన కరెంటు అందుబాటులో తెచ్చేందుకు ఫీడర్ల మార్పు చేస్తేనే  ఇది జరుగుతుందని చెపితే దాని కోసం రూ.1700 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేశాం. ఈ 29 నెలల కాలంలో వైయస్సార్‌ ఉచిత పంటల భీమా ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3716 కోట్లు అందించగలిగాం. 


ఈ రోజు రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని అందుబాటులోకి తేగలిగాం. 

ఇవి కాక 2 యేళ్లలో రూ.35 వేల కోట్ల పై చిలుకు ధాన్యం సేకరణకోసం ఖర్చు పెట్టాం. మరో రూ.1800 కోట్లు పత్తిపంట కోసం కేటాయించాం. ఇతర పంటల కోసం సుమారు రూ.6400 కోట్లు ఖర్చు చేశాం. 


*గత ప్రభుత్వ ధాన్యం బకాయిలూ చెల్లించాం....* 

ఏ రోజూ ధరలు పడిపోకూడదు, రైతు నష్టపోకూడదని ఈ కార్యక్రమాలు చేశాం. రూ.960 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయలు కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది.  గత ప్రభుత్వం వదిలేసిన రూ. 384 కోట్ల విత్తన బకాయిలునూ మనమే చెల్లించాం. 


*ఇన్‌పుట్‌ సబ్సిడీ...* 

ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లో ఆ పంట నష్టం అందించే విధంగా ఆ డబ్బు రైతుల చేతుల్లోకి వచ్చి, వచ్చే పంటకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటసారి ఇన్‌పుట్‌ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్‌లో ఇచ్చే కొత్త వరవడిని తీసుకొచ్చాం. 


రైతన్నలకు దన్నుగా నిల్చేందుకు ఏపీ అమూల్‌ పాలవెల్లువను తీసుకురాగలిగాం. వైయస్సార్‌ జలకళ ద్వారా ఉచిత బోర్లు వేయించి తోడుగా నిలబడగలిగాం. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద సంవత్సరానికి రూ.780 కోట్లు చెల్లించాం. ఆక్వా రైతులకు సబ్సిడీ కింద కరెంటు యూనిట్‌ రూ.1.5 కే అందిస్తున్నాం. దాదాపుగా ఈ రెండేళ్లలో రూ.1560 కోట్లు కరెంటు సబ్సిడీ రూపంలో ఆక్వా రైతులకు తోడుగా నిలబడగలిగాం.

 

*ఆత్మహత్యలకు బదులు ఆర్బీకేలను చూడడానికి.....* 

కాబట్టే ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలను చూడడానికే ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే ఈ రోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి బృందాలు వచ్చి తిలకిస్తున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను.


*దేవుడి దయతో.....* 

దేవుడి దయతో ఇక మీదట కూడా సకాలంలో మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని వ్యవసాయం పండగగా కొనసాగాలని ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు కనిపించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి చల్లని దీవెన లు మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లవేలలా మన ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 



ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి,  వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular posts
Gudivada - Kankipadu road widening, development works start
Image
నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి... విజేత‌లుగా నిల‌వండి
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
ఆస్తినష్టం, పంట నష్టం అంచనాల తయారీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
Image
రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం
Image