కొవ్వూరు (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల కోసం
ఏడుమంది బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షలు అందించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి చేదోడు ఉంటూ, ఆపదలో అన్నలా జగన్మోహన్ రెడ్డి ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఏడుగురు బాధితులు వైద్య ఖర్చులు కోసం వెచ్చించి, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మజ్జి రాము (25 వేలు) , ఉండవల్లి మిహన్ బాబు (25 వేలు) ; మట్టా లక్ష్మీ శైలజ కుమార్తె కి (32 వేలు) ; కె. శేషరత్నం (90 వేలు) ; టి. అనురాధ (15 వేలు) ; ఏ. రషీదా (27 వేలు) ; ఏ. పవన్ కుమార్ (20 వేలు) చొప్పున మంజురైన సొమ్మును చెక్కు రూపంలో అందచేయ్యడం జరిగింది.
కార్యక్రమంలో ఎంపిపి కాకర్ల నారాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment