సిఎస్ డా.సమీర్ శర్మ అధ్యక్షతన ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

  

సిఎస్ డా.సమీర్ శర్మ అధ్యక్షతన ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

అమరావతి,29 అక్టోబరు (ప్రజా అమరావతి):ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో పాల్గొన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడి రిప్రజంటేషన్లను సిఎస్ కు అందించారు. ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ మాట్లాడుతూ సుమారు 10సంవత్సరాల తర్వాత ఈజాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.పిఆర్సి సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.పిఆర్సి సిఫార్సులు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పిఆర్సి కమిటీ అధికారులతో సమావేశమై పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుందన్నారు.పిఆర్సి నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సిఎస్ సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.సుమారు గత రెండేళ్ళుగా కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఆశా జనకంగా లేవని పరిస్థితులను ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని సూచించారు. పిఆర్సికై సుమారు మూడేళ్ళుగా  ఎదురు చూస్తూన్నారని త్వరలో పిఆర్సి అమలు చేస్తామని సిఎస్ డా.సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.పిఆర్సి నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలన్న దానిపై ఆయన స్పందించి ఆనివేదిక సమ్మరీని వారం రోజుల్లోగా అందిస్తామని తెలిపారు.కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్ మరియు హెచ్ఆర్ ముఖ్య కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.వివిధ ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.

సమావేశానికి స్వాగతం పలికిన సర్వీసెస్ మరియు హెచ్ఆర్ఎం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 2010లో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగ్గా మరలా ఇప్పుడు జరుగుతోందని చెప్పారు.ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించి పరిష్కరించుకునేందుకు ఉన్న అత్యున్నత బాడీ ఇదని తెలిపారు.

ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్ చంద్ర,ప్రవీణ్ కుమార్,ఎస్ఎస్ రావత్,వి.ఉషా రాణి,గోపాల కృష్ణ ద్వివేది,బి.రాజశేఖర్, కార్యదర్శి శ్యామల రావు,అరుణ్ కుమార్,కె.భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అలాగే 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎపిఎన్జిఓ,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం,ఎస్టియు ఎపి,ఎపిటిఎఫ్,ఎపియు టిఎఫ్,ఎపి రెవెన్యూ అసోసియేషన్,ఎపి గవర్నమెంటు ఎంప్లాయిస్ అసోసియేషన్,ఎపి ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎపి కమర్షియల్ టాక్సెస్ ఎన్జిఓ అసోసియేషన్,ఎపి లైవ్ స్టాక్ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి టైపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు బి.శ్రీనివాసరావు, వెంకట్రామి రెడ్డి,జోసెఫ్ సుధీర్,హృదయ రాజు, వెంకటేశ్వర్లు, బొప్పరాజు వెంకటేశ్వర్లు,కె.సూర్యనారాయణ,రవి కుమార్, టివి.ఫణి పేర్రాజు,బి.లక్ష్మీనారాయణ, కెఆర్.సూర్యనారాయణ,ఎల్.సూర్యనారాయణ,మోహన్ గోపాల కృష్ణల తోపాటు ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు పాల్గొని ఉద్యోగ సంఘాలకు సంబంధించి వివిధ సమస్యలపై మాట్లాడి వారి డిమాండ్లపై సిఎస్ కు రిప్రజంటేషన్లు ఇచ్చారు.

     చే జాా

Comments