*మహిళా సాధికారతే ధ్యేయం - కాకాణి*
*శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల కేంద్రంలోని కె.సి.ఆర్.యస్.కళ్యాణ మండపంలో "వై.యస్.ఆర్.ఆసరా" రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి "వై.యస్.ఆర్. ఆసరా" ద్వారా రెండో విడత మహిళలకు అందిస్తున్న 30 కోట్ల 85 లక్షల రూపాయల చెక్కును ప్రదర్శించిన ఎమ్మెల్యే కాకాణి.*
*"వై.యస్.ఆర్.చేయూత" ద్వారా ఆర్థిక లబ్ధిపొంది వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళల స్టాల్స్ ను పరిశీలించి అభినందించిన ఎమ్మెల్యే కాకాణి.*
*బ్యాంకు లింకేజీ ద్వారా 40 కోట్ల 50 లక్షల రూపాయలు సంఘ బంధాలకు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.*
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మహిళలకు సంబంధించిన రుణాలను 4 విడతల్లో చెల్లిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రెండు విడతలు ఇప్పటికే మహిళల ఖాతాలో జమ చేశారు.
కరోనా కష్టకాలంలో కూడా మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
సర్వేపల్లి నియోజకవర్గంలో 172 గ్రామ సమాఖ్యలకు సంబంధించి 5,945 సంఘ బంధాలలో సభ్యులుగా ఉన్న 61, 176 మందికి *"వైయస్సార్ ఆసరా"* ద్వారా లబ్ధి చేకూరుతుంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో *"వై.యస్.ఆర్. ఆసరా"* పథకం ద్వారా నాలుగు విడతల్లో 123కోట్ల 40 లక్షల రూపాయలు మహిళలకు అందజేస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే విడతకు 30 కోట్ల 85 లక్షల రూపాయల చొప్పున రెండు విడతల్లో 61 కోట్ల 70 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మహిళలు అందజేశాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో బ్యాంకు లింకేజీ ద్వారా 336 కోట్ల 25 లక్షల రూపాయలు ఇప్పటివరకు సంఘ బంధాలకు అందజేశాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో సున్నా వడ్డీ పథకం ద్వారా 15 కోట్ల 82 లక్షల రూపాయలు మేర మహిళలు లబ్దిపొందారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో 50 వేల నుండి 1లక్ష వరకు రుణం తీసుకున్న సభ్యులకు సున్నా వడ్డీ వర్తింపుజేస్తే, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1లక్ష నుండి రెండు లక్షల రూపాయలు తీసుకున్న సభ్యులకు కూడా సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తున్నాం.
తెలుగుదేశం ప్రభుత్వం మహిళా గ్రూపులకు 5 లక్షల నుండి 10 లక్షలు ఇస్తే, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క గ్రూపుకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు అందజేస్తున్నాం.
చంద్రబాబు గతంలో వి.ఓ.ఏ.లకు 3 వేల రూపాయల జీతం ఇస్తే, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వి.ఓ.ఏ.ల జీతాలు 10వేలకు పెంచారు.
మహిళలకు సంబంధించి అమ్మ ఒడి వై.యస్.ఆర్ చేయూత, వై.యస్.ఆర్.ఆసరా లాంటి అనేక పథకాలు ప్రవేశ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లి, అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
చంద్రబాబు ఇప్పటికే పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకున్నాడు.
చంద్రబాబు తన మనుషులను కోర్టుకు పంపించి, ఇళ్ల పట్టాలు డి-ఫామ్ రూపంలో ఇవ్వాలని, మహిళల పేరుతో కాకుండా, పురుషుల పేరుతో కూడా ఇవ్వవచ్చని కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చే విధంగా ప్రయత్నించాడు.
పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, పేద ప్రజలకు కట్టించే ఇళ్లకు అడ్డుపడి, చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలిపోయాడు.
సర్వేపల్లి నియోజకవర్గంలో మహిళలకు అండగా నిలుస్తూ, మహిళా సాధికారత ధ్యేయంగా పని చేస్తా.
addComments
Post a Comment