ఆసరా వారోత్సవాలలో కాకాణి, గురుమూర్తి, కళ్యాణ్

 *ఆసరా వారోత్సవాలలో కాకాణి, గురుమూర్తి, కళ్యాణ్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో వై.యస్.ఆర్.ఆసరా వారోత్సవాలలో తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తిగారు, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రభుత్వం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా చెత్త తరలించేందుకు అందించిన వాహనాలను జెండా ఊపి, ప్రారంభించిన ముఖ్య అతిధులు.
 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఆశీస్సులు మెండుగా ఉండాలి.


 చంద్రబాబు రుణమాఫీ పేరిట మహిళలను మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి, మహిళలకు అండగా నిలిచారు.


 ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నాటికి ఉన్న బకాయిలు నాలుగు విడతల్లో చెల్లిస్తానని హామీ ఇచ్చి, రెండు ఆర్థిక సంవత్సరాలలో రెండు విడతలు పూర్తి చేశారు.


 వైయస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం ఎన్నో కుటుంబాలకు ఊరటనిస్తుంది.


 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఒకేరోజు 4097 చెత్త తరలింపు వాహనాలను ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.


 ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని పరిశుభ్రమైనవిగా తీర్చిదిద్దమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు.


 కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే పాల్గొని, స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారికి, శాసనమండలి సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు.


 సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా.

Comments