*నవంబరు నెలలో తిరుపతిలోని టిటిడి స్థానిక ఆలయాల్లో విశేష ఉత్సవాలు*
తిరుపతి (ప్రజా అమరావతి):
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం…..
నవంబరు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
నవంబరు 4న దీపావళి ఆస్థానం.
నవంబరు 6న శ్రీ తిరుమల నంబి శాత్తుమొర.
నవంబరు 8న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర.
నవంబరు 9న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.
నవంబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.
నవంబరు 11వ తేదీ శ్రీ వేదాంతదేశికర్ శాత్తుమొర.
నవంబరు 12న శ్రీ భూతాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
నవంబరు 13న శ్రీ పెరియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
నవంబరు 19న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
నవంబరు 16వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్రవచనం నిర్వహిస్తారు.
నవంబరు 18న కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీప్పొత్సవం.
శ్రీ కోదండరామాలయంలో….
నవంబరు 2న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
నవంబరు 4న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం,
సాయంత్రం 6 గంటలకు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
– నవంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయంలో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
నవంబరు 19న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
– నవంబరు 24న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
addComments
Post a Comment