అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు ...మంత్రి తానేటి వనిత

 


చాగల్లు (ప్రజా అమరావతి) ;   


అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు ...మంత్రి తానేటి వనిత 



- రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత 





డ్వాక్రా అక్క చెళ్ళమ్మ ల రుణాలను ఇచ్చిన మాటకు కట్టుబడి 4 విడతల్లో నేరుగా వారి ఖాతాలను జమచెయ్యడం జరుగుతోందని  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. 


మంగళవారం చాగల్లు  మండలం నందిగంపాడు, ఉనగట్ల, చిక్కాల, కలవలపల్లి   గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ,  2014 చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు, బంగారం రుణాలను చెల్లించ వద్దు, నేను అధికారంలోకి వొచ్చిన వెంటనే ఆయా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, మోసం చేశారు, దగా చేశారన్నారు. ఆ మాటలు నమ్మి అప్పులు చెల్లించ పోవడంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. ఇది వాస్తవం కాదా అని మంత్రి  ప్రశ్నించారు. అయితే జగనన్న రుణాలు చెల్లించండి, వాటిని మీమీ బ్యాంకు ఖాతాలను 4 విడతల్లో చేల్లిస్తాను, అని తన పాదయాత్ర సమయంలో మహిళలకు హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, తదుపరి రోజుల్లో కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురైన కూడా హామీకి కట్టుబడి అడుగులు వేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా మహిళలు కోసం, మన పిల్లలు కోసం ఇంతలా ఆలోచించిన సీఎం లేరన్నారు. నేడు జగనన్న మన పిల్లలు భవిష్యత్ కోసం నాడు నేడు, అమ్మఒడి, విద్యాకానుక, పౌష్టికాహారం, మధ్యాహ్న భోజన పధకం, స్వంత ఇంటి కల , ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మహిళలపై నమ్మకం తో జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఆసరాగా నిలుస్తున్నారు, మీరు కూడా జగనన్న కు అండగా నిలిచి మీ అభిమానాన్ని 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా చాటుకోని, మరింత ఘన విజయం అందించాలని కోరారు. 


 రెండో విడత వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చాగల్లు  మండలంలో 11.4.2019 నాటికి 1235 మంది స్వయం సహాయక సంఘాలకు   ఉన్న అప్పు  సుమారు రూ.44.61 కోట్లు ఉందన్నారు. తొలివిడతగా రూ. 11 కోట్ల 11 లక్షలు జమ చేసామని మంత్రి తానేటి వనిత తెలిపారు.  ఇప్పుడు రెండో విడతలో రూ.11 కోట్ల 16 లక్షల 59 వేలు నేరుగా బ్యాంకు ల ద్వారా మహిళ ల వ్యక్తిగత ఖాతాలకు బదలీ చెయ్యడం జరిగిందని తానేటి వనిత తెలిపారు. 


  

చాగల్లు  మండలం లో  వైఎస్సార్ ఆసరా రెండో విడతగా ఉనగట్ల లోని 126 గ్రూపులకు రూ.115.54 లక్షలు, ;  నందిగంపాడు  లో  20 గ్రూపులకు రూ.13.99  లక్షలు; చిక్కాల లోని 162 గ్రూపులకు రూ. 144 .36 లక్షల  ; కలవపల్లి  లో  110 గ్రూపులకు  రూ. 69.04 లక్షలు,  లక్షలను  వైఎస్సార్ ఆసరా రెండో విడత మొత్తాలను మహిళా సభ్యుల  లబ్దిదారుల ఖాతాకు చెల్లింపు చేశామన్నారు. 


డ్వాక్రా మహిళలు జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. 


 కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ లు  ఉనగట్ల .. మట్టా వెంకటరావు, నందిగంపాడు .. కుడపి రాంబాబు, చిక్కాల .. కొయ్య మణి, కలవలపల్లి .. ఆకుల లక్ష్మీ,  చాగల్లు జెడ్పిటిసి గారపాటి విజయదుర్గా, ఎంపిపి మాట్టా వీరాస్వామి, ఉపాధ్యక్షులు జె.రామచంద్రరావు,  ఎంపీటీసీ లు ఉసురుమర్తి జ్యోతి,  పి.వెంకటేశ్వర రావు, టి.గాంధీ,  జి.వెంకట నరసింహమూర్తి, ఉ. భాగ్య వతి, ఎల్ ఎన్ ఎస్ ప్రభావతి, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర సంచాలకులు ఎస్ కె. సర్దార్ పాషా, ఎఎంసి ఛైర్మన్ ఏ శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు వికాసం జనరల్ సెక్రటరీ ఏ దొరైస్వామి, కట్టా ఉమా మహేశ్వరరావు,  ఎంపీడీఓ బి. రాం ప్రసాద్, తాహసీల్దార్ ఎమ్. శ్రీనివాసరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురా లు ఎన్. సుబ్బలక్ష్మి,   ఇతర ప్రజాప్రతినిధులు,  అధికారులు, మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.




Comments