తాడేపల్లి (ప్రజా అమరావతి); కేఎల్ విశ్వవిద్యాలయం లో స్టార్ట్-అప్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్,హెచ్ఎంటివి సంయుక్తంగా స్టార్ట్-అప్ హౌస్ ఆడిషన్స్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉప కులపతి Dr.పార్థసారధి వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టార్ట్-అప్ గురించి వివరిస్తూ ఒక విద్యార్ధి ఆలోచనను స్టార్ట్-అప్ కి ఎలా మలచాలి...
ఒక ఉత్పత్తి గా ఎలా మలచాలిఅనే అంశంపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.స్టార్ట్-అప్ లో వివిధరకాల దశలను, వాటిని ఎలా అధిగమించాలి మొదలగు విషయాలను వెల్లడించారు.తమ విశ్వవిద్యాలయం లో ఉన్న స్టార్ట్ అప్ కి సంబంధించిన సౌకర్యాలను వివరించారు.భారత కేంద్ర ప్రభుత్వం నుంచి కే ఎల్ విశ్వ విద్యాలయానికి అందించబడిన వివిధ పధకాలను గురించి చెప్పారు. డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేషన్ (TBI ), అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ (ACIC) పధకాల యొక్క ప్రాముఖ్యతను, అందునుండి విద్యార్థులకు కలుగు ఉపయోగాలను తెలిపారు.విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమలు నిర్వహించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.అనంతరం స్టార్ట్-అప్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్,సీఈఓ Dr.వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ,తమ కంపెనీ ప్రతి కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారి నుంచి నూతనత్వం కలిగిన అద్భుతమైన ఆవిష్కృతులను ప్రోత్సహిస్తూ వాటిని ఒక ఉత్పత్తి దశ వరకు తీసుకువెళ్ళడానికి విద్యార్థులకు తోడ్పడడమే తమ కంపెనీ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయం స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ A. శ్రీనాథ్,స్టార్ట్-అప్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు వేణుగోపాల్ , లక్ష్మి నరసింహం సీఆర్ఎం - స్టార్ట్-అప్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కే. గిరిధర్,ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ P. సాయి కిరణ్,ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్,సీఐఐఈ ప్రొఫెసర్ ఇంచార్జి డాక్టర్ కె.రాజశేఖర్ పాల్గొన్నారు.
addComments
Post a Comment