ఒంగోలు, ప్రకాశం జిల్లా (ప్రజా అమరావతి);
*వరసగా రెండో ఏడాది వైఎస్‌ఆర్ ఆసరా
*
*ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్దిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్, అటవీ. పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి*
సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న వ్యక్తి. గతంలో నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్పుకున్న ఒక పెద్దాయన ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ డ్వాక్రా మహిళలకు సున్నా చుట్టారు. ఏ వాగ్దానం అమలుచేయలేదు, పసుపు, కుంకుమ పేరుతో ఎన్నికల సమయంలో హడావిడి చేసినా వారు నమ్మలేదు. అక్కాచెల్లెమ్మలు అంతా శ్రీ జగన్ మాట నమ్మి చరిత్రలో ఎన్నడూలేని విధంగా 151 సీట్లు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సీఎంగారికి టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసినట్లు పేపర్‌లో చూశాం, నేను అడుగుతున్నా వారిని, మీకు సిగ్గుంటే, మీకు నిజంగా ప్రజల్లో ఏమైనా పలుకుబడి ఉంటే గత ఐదేళ్ళలో చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లాకు ఒక్క నిర్ధిష్టమైన పనిచేశారా చెప్పమని సవాల్ చేస్తున్నా ఈ వేదికపై నుంచి. మీరు చంద్రబాబుకు లేఖ రాయండి, సీఎంగారికి కాదు. అయ్యా ఐదేళ్లలో మీరేం చేయలేదు కాబట్టి ప్రజలు చీదరించుకుంటున్నారు, కాబట్టి మేం ప్రజల్లో తిరగలేకపోతున్నాం, మాకు ఇబ్బందిగా ఉందని బాబుకు లేఖ రాయండి. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీల వైఖరి చూస్తుంటే...ఒకాయన నేను లేస్తే మగాడిని కాదంటారు, నువ్వు నిజంగా మగాడివైతే ఒంటరిగా పోటీ చేసి దమ్ముంటే రాష్ట్రంలో రెండు సీట్లు గెలుచుకుని చూడు. మరి నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న చంద్రబాబు సిగ్గులేకుండా పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాడు. చంద్రబాబు మీరు ఒంటరిగా పోటీ చేయలేని పరిస్ధితి ఉందంటే సిగ్గుపడాలి. మీకు ఒకటే చెబుతున్నాం, మా పులి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే వస్తుంది, మీలాగా అన్నీ కలుపుకుని రావడం సిగ్గుచేటు. ఏమైనా మా నాయకుడు ఎన్ని పార్టీలు వచ్చినా ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. ధన్యవాదాలు
*ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి*
ఈ రోజు ఒక శుభదినం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండో విడత కార్యక్రమానికి ఇక్కడికి రావడం అనేది విశ్వసనీయతకు, నిబద్దతకు నిదర్శనం. గతంలో టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలను మోసం చేసింది, వారంతా రుణాలు కట్టలేక, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి కష్టాలను శ్రీ జగన్ గారు చూశారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్నీ అమలుచేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను అమలుచేస్తూ ప్రజల హృదయాలలో సుస్ధిరమైన స్ధానం సంపాదించుకున్నారు. అమ్మలోని మొదటి అక్షరం అ ను, నాన్న లోని రెండో అక్షరం న్న ను తీసుకుని అన్నగా జగనన్నగా మీరే మా తోబుట్టువు, మీరే మా పిల్లలకు మేనమామ అంటూ జగనన్నను తమ కుటుంబ సభ్యుడిగా ప్రజలు భావిస్తున్నారు. మన సీఎంగారు అక్కాచెల్లెమ్మల జీవితాలలో ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యాన్ని తీసుకొస్తూ ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రజలంతా మీరు మాకు అన్నీ ఇచ్చారు, మీకు మా దీవెనలు ఉంటాయంటూ, మీరే ముప్పై ఏళ్ళు సీఎంగా ఉండాలని, మీకు మేం అండగా ఉంటామంటున్నారు. ఒంగోలులో దసరా పండుగ వారం ముందే వచ్చినట్లుంది, టీడీపీ నేతలు ఒక విషయం గమనించాలి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కులాల మధ్య చిచ్చుపెట్టినా ప్రజలంతా మేం జగనన్నకు తోడుగా ఉంటామంటున్నారు, ఏ ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. ప్రకాశం జిల్లాకు సీఎంగారు చేయాల్సిందంతా చేశారు, వరాల జల్లు కురిపించారు. ప్రకాశం జిల్లాలో ఏ సమస్య లేదు కాబట్టి వెలిగొండ ప్రాజెక్ట్ ఇష్యూని టీడీపీ తీసుకొస్తుంది, కానీ జగనన్న రెండేళ్ళలో వెలిగొండ పనులను పరిగెత్తించారు, టీడీపీ హయాంలో ఐదేళ్ళలో చేయలేనిది రెండేళ్ళలో చేశారు, పునరావాస కాలనీల నిర్మాణం, టన్నెల్ పనులు, ముంపు బాధితుల ప్యాకేజీపై ఎక్కడైనా చర్చకు సిద్దం. వెలిగొండ ప్రాజెక్ట్ నీటి విడుదల కూడా జగనన్న అమృత హస్తాల మీద త్వరలోనే జరుగుతుంది. గత ప్రభుత్వం జిల్లాలో యూనివర్శిటీని కాగితాల మీదే ఏర్పాటుచేస్తే మేం చట్ట సవరణ చేసి పూర్తి సిబ్బందితో చక్కటి యూనివర్శిటీని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ధన్యవాదాలు
*పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి*
పాదయాత్రలో శ్రీ జగన్ గారు ప్రతీ ఇబ్బందిని తెలుసుకుని మ్యానిఫెస్టోలో పొందుపరిచి అవన్నీ కూడా మొదటి ఏడాదిలోనే 90 శాతం పూర్తిగా అమలుచేసిన గొప్ప నేత. చంద్రబాబు రుణాలు కట్టొద్దు అని చెప్పిన మాట నమ్మి మహిళా సంఘాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయాయి, కానీ వైఎస్‌ఆర్ ఆసరా పేరుతో మీకు గత ఏడాది మొదటి విడత చెల్లించాం, ఇప్పుడు రెండో విడత కార్యక్రమం చేస్తున్నాం. మహిళలు ఆర్ధికంగా బలపడాలని పెద్ద పెద్ద కంపెనీలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. గత ఏడాది కరోనా ఇబ్బందులు ఉన్నా మీ అకౌంట్‌లలో డబ్బు పడే విధంగా ఏర్పాటు చేశారు, ఈ సారి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఉత్సవంలా చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నో చెప్పాడు కానీ ఏమైంది, బాబు వచ్చాడు ఉన్న ఉద్యోగాలు పోయాయి, రైతులకు ఏం చేయలేదు, మహిళా సంఘాలను ఆర్ధికంగా దివాళా తీయించాడు. ఏది ఏమైనా కూడా ఒక నిబద్దత గల వ్యక్తి సీఎంగా ఉంటే పాలన ఎలా ఉంటుందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి సీఎంని మనం ఎప్పుడూ గౌరవించాలి, ఆదరించాలి, ఆశీర్వదించాలి. మీరంతా శ్రీ వైఎస్ జగన్ గారికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
*స్వాతి, లబ్దిదారు, పాకల గ్రామం, శింగరాయకొండ మండలం*
జగనన్నా మేం ఇరవై ఏళ్ళుగా గ్రూపులు కట్టుకుని సంఘాలు ఏర్పాటుచేసుకుని అప్పులు తీర్చుకోలేక బాధపడుతున్న సమయంలో మీరు పాదయాత్రలో మా కష్టాలు చూసి మాకు ఏం చేస్తే మంచి జరుగుతుందనే ఆలోచన చేసి మీరు మాటిచ్చారు. మీరు మాట ఇచ్చిన ప్రకారం వైఎస్‌ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టారు. అన్నా మా సంఘంలో నాకు రూ 24 వేలు వచ్చాయి, మేం తీసుకున్న బాకీలకు వడ్డీలు కట్టలేక బాధపడుతున్న సమయంలో గతంలో నాన్నగారు పావలా వడ్డీ ఇచ్చారు. అన్నా చాలా చోట్ల మతం, కులం అంటున్నారు, మతం మనకు ఆకలి తీర్చదు, కులం మన కష్టాన్ని తీర్చదు. మేం అయితే మా ఆకలి తీర్చిన జగనన్న కులమని చెప్పుకుంటున్నాం, మాకే కాదు అన్నా మా పిల్లల పిల్లలకు కూడా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అన్నా
*అశ్విని, లబ్దిదారు, అల్లూరు గ్రామం, కొత్తపట్నం మండలం*
అన్నా నేను సాయి స్నేహ గ్రూప్‌లో సభ్యురాలిని, గత ప్రభుత్వంలో చాలా కష్టాలు, బాధలు పడ్డాం. చంద్రబాబు ఏ హమీ నిలబెట్టుకోలేదు కానీ మీరు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఎన్నో చేశారు. మీరు తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. పాదయాత్రలో మా కష్టాలు చూసి నవరత్నాలు పథకాలు పెట్టారు, నాకు వైఎస్‌ఆర్ ఆసరా వచ్చింది, మా బాబుకు అమ్మ ఒడి వచ్చింది, మా వారికి రైతు భరోసా, మా మామ గారికి పెన్షన్ వస్తుంది. నేను రెండు గేదెలు కొనుక్కుని అమూల్ సంస్ధలో పాలు పోస్తున్నాను, మాకు లాభాలు వస్తున్నాయి, ప్రైవేట్ కేంద్రంలో పాలు పోస్తే లీటర్‌కు రూ. 40 నుంచి రూ. 50 మాత్రమే వస్తుంటే అమూల్‌లో మాత్రం రూ. 50 నుంచి రూ. 75 లాభాలు వస్తున్నాయి. మా గ్రామంలోనే అమూల్‌కు రోజుకు 250 లీటర్లు పాలు సేకరిస్తున్నాం, నేను స్త్రీ నిధి లోన్ తీసుకుని మరో రెండు గేదెలు తీసుకున్నాం, మా వారు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు, ఆయన కూడా లోన్ తీసుకుని సొంతంగా కెమెరా కొనుక్కున్నారు, మేం కష్టపడి పనిచేసుకుంటూ ఇల్లు కట్టుకున్నాం, మేం సంతోషంగా ఉన్నాం, మేమే కాదు మీ పథకాల వల్ల లబ్దిపొందిన ప్రతీ కుటుంబం మాలాగే సంతోషంగా ఉంది. మాకు నీడగా తోడుగా ఉండే మీకు ఎప్పుడూ అండగా ఉంటామన్నా. మా మహిళల అందరి తరపునా మీకు ధన్యవాదాలు అన్నా
addComments
Post a Comment