తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు - సిఫార్సు లేఖలు స్వీకరించబడవు*


 *తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు - సిఫార్సు లేఖలు స్వీకరించబడవు*

        

 తిరుమల (ప్రజా అమరావతి):

అక్టోబరు 7న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు


 అక్టోబ‌రు 6న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

    శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా ఆల‌యంలో ప్ర‌త్యేక వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

 ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 7 న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.


 అక్టోబ‌రు 6న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.