న్యూ ఢిల్లీ (ప్రజా అమరావతి);
*టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నాని, అచ్చెన్నాయుడు*
ఏపీలో ఘటనలపై రాష్ట్రపతికి నివేదిక అందించిన టిడిపి నేతల బృందం
మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సి, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ,ఆర్ధిక దివాళా,ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి అంశాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టిడిపి నేతల బృందం
రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు,అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించిన టిడిపి నేతల బృందం
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని ,రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన టిడిపి నేతలు
రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు ప్రధాని,హోం మంత్రిని సమయం కోరిన టిడిపి
*8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతి కి అందజేసిన టీడీపీ బృందం*
ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ ,డ్రగ్స్ మైనింగ్, సాండ్, మాఫియా విస్తరించింది
న్యాయ, మీడియా సహ అన్ని వ్యవస్థల పైన దాడులు జరుగుతున్నాయి
*రాష్ట్రపతిని టీడీపీ బృందం కోరిన నాలుగు ప్రధాన డిమాండ్స్*
1.ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
2.రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలి
3.అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలి
4. అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీనీ రీకాల్ చేయలని రాష్ట్రపతి ని కోరిన తెలుగుదేశం పార్టీ బృందం...
addComments
Post a Comment