ఎడ్యుకేషన్ హబ్ గా సర్వేపల్లి - కాకాణి

 *ఎడ్యుకేషన్ హబ్ గా సర్వేపల్లి - కాకాణి*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో బాలయోగి గురుకుల (బాలికల) పాఠశాల యందు 1 కోటి 43 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన అదనపు తరగతులకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .




 విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మ ఒడి, నాడు - నేడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన,  విద్యా కానుక లాంటి కార్యక్రమాల కోసం 150 కోట్లు ఖర్చుచేశాం.


 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, మానవ వనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రిగారు కృషి చేయడం, ప్రశంసనీయం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో గురుకులాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి వసతి సదుపాయాలు కల్పిస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గం విక్రమ సింహపురి యూనివర్సిటీతో పాటు, అనేక విద్యా సంస్థలు నెలకొల్పడం ద్వారా *"ఎడ్యుకేషన్ హబ్"* గా రూపుదిద్దుకుంటుంది.


 జిల్లా పరిషత్ చైర్మన్ గా *"విజయ దీపిక"* పేరిట విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించాం.


 జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లాలో *"జెడ్పీ చైర్మన్ కప్"* పేరిట విద్యార్థులకు ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు ఏర్పాటు చేసి, విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రీడా నైపుణ్యం ప్రదర్శించే అవకాశం కల్పించాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా.

Comments