ప్రతి ఒక్క పాడి రైతు తమ పశువులకు గాలికుంటు వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించి

 నెల్లూరు  (ప్రజా అమరావతి);

ప్రతి ఒక్క పాడి రైతు తమ పశువులకు గాలికుంటు వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించి


, మెరుగైన పాల ఉత్పత్తితో అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పాడి రైతులకు సూచించారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని కలిగిరి పశు వైద్యశాలలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ టీకాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పశువులకు వేయించాలన్నారు. సుమారు 7 లక్షల 65 వేల పశువులకు టీకాలు వేసేందుకు పశుసంవర్ధక శాఖ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, పశు వైద్యశాలలో ఈ టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రతి రైతు ఒక పశువులు కూడా పెంచుకోవాలన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో కృషి చేస్తున్నామని, వెలిగొండ, హై లెవెల్ కెనాల్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని చెప్పారు. జిల్లాలో 400 పాల కేంద్రాలను రానున్న ఏడాది కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పశువులు వ్యాధుల బారిన పడి పాడి రైతులు నష్టపోకుండా గాలికుంటు నివారణ టీకాలను తప్పకుండా ప్రతి పశువుకు వేయించాలన్నారు. కలిగిరి పశు వైద్యశాలకు ప్రహరీ గోడ, భవన మరమ్మతులు, బోరు ఏర్పాటు తదితర మౌళిక వసతుల కల్పనకు కలెక్టర్ కృషి చేయాలని ఆయన కోరారు. గాలికుంటు నివారణ టీకాల కరపత్రాలను ఆవిష్కరించి, రైతులకు యానిమల్ హెల్త్ కార్డులను కలెక్టర్ అందించారు. అంతకుముందు కలెక్టర్, ఎమ్మెల్యేలు ఎద్దు కు గాలికుంటు టీకాలు వేశారు.

 అనంతరం కొండాపురం మండలం  చింతలదేవిలోని జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా వారు వివిధ రకాల పశువులను పరిశీలించి వాటి జాతుల గురించి పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీ శీనానాయక్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీ మహేశ్వరుడు, శ్రీమతి లావణ్య లక్ష్మి,డిప్యూటీ డైరెక్టర్లు శ్రీ రమేష్ బాబు, శ్రీ సురేష్, శ్రీ సోమయ్య, జయచంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ షరీఫ్, జెడ్పిటిసి మాల్యాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నార

Comments