దసరా మహోత్సవములు సందర్బము

 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి) నందు తేది:7-10-2021 నుండి తేది:15-10-2021  వరకు జరగబోవు దసరా మహోత్సవములు సందర్బము


గా తేది:23.9.2021 న ఉదయం 10-00 గంటలకు శ్రీయుత కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కృష్ణా జిల్లా వారు అన్ని లైన్ డిపార్టుమెంట్ వారితో జరిపిన సమన్వయ కమిటీ సమావేశం లోని అంశములు మరియు తీసుకొన్న నిర్ణయములు.

***

గత సంవత్సరము మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు 10,000 మంది భక్తులను మాత్రమే అనుమతించవలెనని  అందులో రూ.100/- టిక్కెట్లు 3000 మందికి రూ.300/- టిక్కెట్లు 3000 మందికి ఉచిత దర్శనము 4000 మందికి ఆన్ లైను ద్వారా జారీచేయబడును. 

మొదటిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9-00 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు మిగిలిన రోజులు  ఉదయం 4 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు మూల నక్షత్రం రోజున  ఉదయం 3 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు దర్శనమునకు అనుమతించబడును.

ఉచిత దర్శనములు-2 లైన్లు,  రూ.100/- మరియు రూ.300/- దర్శనము టిక్కెట్ల ను భక్తులు ఆన్ లైను ద్వారా టైం స్లాట్ ప్రకారము https://aptemples.ap.gov.in ద్వారా దర్శనము టిక్కెట్లు భక్తులకు రిలీజ్ చేయబడినది.

ఈ ఉత్సవాలలో అన్ని రోజులులో ప్రత్యేక లక్షకుంకుమార్చన రూ.3000/- (8 రోజులు)  మరియు మూల నక్షత్రము రోజున రూ.5,000/- (1 రోజు) , ప్రత్యేక చండీహోమము రూ.4000/- (9 రోజులు) ,                            శ్రీ చక్రనవావర్ణార్చన అన్నిరోజులకు రూ.3000/- లు (9 రోజులకు) గా నిర్ణయించడమైనది. సేవా టిక్కెట్లును మొత్తం కెపాసిటీలో 50% మాత్రమే  కోవిడ్ నిభంధనల మేరకు అనుమతించవలెను. 9 రోజులకు కలిపి  ఏ పరోక్ష సేవకైననూ రూ.20,000/- లు ఆన్ లైను https://aptemples.ap.gov.in ద్వారా  చెల్లించి టిక్కెట్టు పొందవచ్చును. 

ఆన్ లైను టిక్కెట్టు లేకుండా వచ్చు భక్తులకు,  అసౌకర్యము కలుగకుండా ఉండుటకు గాను వి.ఎం.సి. ఆఫీసు,  టోల్ గేటు వద్ద మరియు ఓమ్ టర్నింగ్ వద్ద , పున్నమి ఘాట్ వద్ద కరెంటు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయబడును. 

వినాయక గుడి నుండి, టోల్ గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు 3 క్యూ మార్గములు ఏర్పాటు చేయబడును. ఓమ్ టర్నింగ్ వద్ద అదనముగా ఉచిత దర్శనము 1 లైను, వి.ఐ.పి.-1 లైను కలిపి 5 క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనాంతరం శివాలయం మెట్ల మార్గము ద్వారా క్రిందకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేయబడును. అన్ని క్యూ మార్గములను రోజుకు 3 సార్లు సోడియం హైపో క్లోరైడ్ తో స్ప్రే చేయుటకు చర్యలు తీసుకొనబడును. 

కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తులు యావన్మందికి అన్ని క్యూ మార్గముల యందు శానిటైజేషన్ మరియు ధర్మల్ గన్స్ తో చెక్ చేసిన తరువాత మాత్రమే అనుమతించబడును.

కుమ్మరిపాలెం వైపు హెడ్ వాటర్ వర్క్స్ నుండి  క్యూ లైను ఏర్పాటు చేయబడును. 

తాత్కాలిక క్యూ మార్గము నందు వాటర్ ప్రూఫ్ షామియానాలు,  మ్యాట్లు, తాత్కాలిక  విద్యుత్ అలంకరణ, త్రాగునీరు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకొనబడుచున్నవి.

కనకదుర్గ నగర్ నందు 6+6 ప్రసాదము కౌంటర్లు, కొండపైన ఒక కౌంటరు మొత్తము 7 ప్రసాదము కౌంటర్లు ఏర్పాటు చేయబడును.

దేవస్థానమునకు వచ్చు వి.ఐ.పి.లు మరియు వి.వి.ఐ.పిల కొరకు మోడల్ గెస్టు హౌసు నుండి, పున్నమి ఘాట్ నుండి మరియు స్టేట్ గెస్టు హౌసు నుండి  వాహనములు ఏర్పాటు చేయబడును. 

భక్తులు ఎవరైననూ పున్నమి ఘాట్ టిక్కెట్టు వద్ద తీసుకొనినచో వారిని బస్సు ద్వారా కొండపైకి ఓమ్ టర్నింగ్ వరకు వచ్చు ఏర్పాటు చేయబడును.

సీతమ్మ వారి పాదాల వద్ద 300 షవర్స్ ఏర్పాటు చేయబడును. 

దుర్గా ఘాట్ నందు భక్తులను ఎవరికి ప్రవేశము ఉండదని తెలుపవలెను.

సీతమ్మ పాదాలు వద్ద, బస్టాండు వద్ద, రధం సెంటర్ వద్ద, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్ పార్కింగ్  వద్ద అవసరమగు  తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడును. 

దేవస్థానము నందు ప్రస్థుతము ఉన్న 160 పారిశుధ్య సిబ్బంది కి అదనముగా 150 మంది సిబ్బంది వినియోగించబడును. 

సోడియం హైపోక్లోరైడ్ తో స్ప్రే చేయుటకు , శానిటైజేషన్ చేయుటకు గాను అదనముగాను ప్రత్యేకముగాను మూడు (3) షిఫ్టుల యందు పారిశుధ్యపని వారిని ఏర్పాటు చేయబడును. 

దేవస్థానము నందు ప్రస్థుతము ఉన్న 150 సెక్యూరిటీ సిబ్బంది వారికి అదనముగా 150 మంది సిబ్బంది ని  వినియోగించబడును.

భక్తుల భద్రత దృష్ట్యా దేవస్థానము నందు ప్రస్థుతం ఉన్న సి.సి.కెమాలు 156 కాక అదనముగా 20 కెమారాలు ఏర్పాటు చేయబడును. 

కమాండ్ కంట్రోల్ రూము వద్ద, శ్రీయుత కలెక్టరు వారి కార్యాలయము మరియు శ్రీయుత పోలీసు కమీషనరు వారి కార్యాలయము వద్ద వీక్షించుటకు సి.సి.కెమారాలు కంట్రోల్ రూము ఏర్పాటు చేయబడును.

భక్తులకు నిరంతరము పబ్లిక అడ్రసింగ్ సిస్టమ్స్ ద్వారా సూచనలు జారీచేయబడును.

దర్శనము అనంతరము కొండ దిగువన మహామండపము వద్ద కొబ్బరికాయలు కొట్టుటకు ఏర్పాటు చేయబడును.

కొండ పైన, కొండ దిగువ భాగమున అన్ని ప్రదేశములలో సూచన బోర్డులు ఏర్పాటు చేయబడును.

ది:15-10-2021న శివాలయము నుండి ఊరేగింపుగా బయలు దేరి రధము సెంటర్ మీదుగా దుర్గాఘాట్ కు వెళ్ళి తెప్పోత్సవము నిర్వహించబడును.

ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ వారికి కొండపైన పోడియంఏర్పాటు చేయబడును. ప్రధాన ఆలయము లోనికి ఎటువంటి కెమారాలు అనుమతించబడదు. 

హోల్దింగ్ ఏరియా ప్రదేశములో నదిలో పలికి ఎవరూ ప్రవేశించకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయబడును. 

సీతమ్మవారి పాదాల వద్ద తాత్కాలిక కేశఖండన శాలను ఏర్పాటు చేయబడును అందుకు కావలసిన బార్బర్లను షిఫ్టుకు 100 మంది చొప్పున అదనముగా 50 మందిని ఏర్పాటు చేయబడును.

సీతమ్మవారి పాదాలు వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయవలెను.

దసరా ఉత్సవముల సందర్బముగా పనిచేయు సిబ్బంది యావన్మంది కి డి.ఎం. అండ్ హెచ్.ఓ వారి ద్వారా ర్యాపిడ్ టెస్ట్స్  చేయబడును..

ఉభయదాతలకు గాంధీజీ మునిసిపల్ హైస్కూల్ వద్ద రెండు బస్సులను ఏర్పాటు చేయబడును అలాగే పున్నమి ఘాట్ వద్ద, సీతమ్మవారి పాదాల వద్ద ఒక బస్సును ఏర్పాటు చేయబడును. 

క్యూ లైన్ల నందు భక్తులకు ఎక్కువ ప్రదేశములలో శానిటైజర్స్ పాయింట్లు ఏర్పాటు చేయబడును. 

శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తులు ఎవరైనా మాస్కులు మరచిపోయిన యెడల వారికొరకు మాస్కులు  దేవస్థానము వారు ఏర్పాటు చేయబడును. 

గత సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరము కూడాభవానీ భక్తులకు ఇరుముడి పాయింట్లు , హోమగుండములు ఏర్పాటు చేయుటకు వీలుపడదని తెలియజేయడమైనది.

అమ్మవారి దర్శానార్ధము విచ్చేయు భక్తులకు ముఖ్యముగా త్రాగునీరు వాటర్ డ్రమ్ముల ద్వారా మరియు వాటర్ ప్యాకెట్లను ద్వారా కూడాఏర్పాటు చేయబడును.

చిన్నపిల్లలకు ఓమ్ టర్నింగ్ వద్ద పాలు ఏర్పాటు చేయబడును. 

భక్తుల సౌకర్యార్ధం ఉదయం 5 గం.ల నుండి 11 గం.ల వరకు బెల్లం పొంగళి మరియు 11 గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకు సాంబారు రైస్ , పెరుగుఅన్నం ప్యాకెట్లు మరియు సాయంత్రం 4 గం.ల నుండి 10 గం.ల వరకు బెల్లం పొంగళి భక్తులకు ఏర్పాటు చేయబడును. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు టీ ఇచ్చునట్లు ఏర్పాటు చేయబడును.  

గత సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరము కూడా సాంస్కృతిక కార్యక్రమములు నిలుపుదల చేయడమైనది. 

గత సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరము కూడా నగరోత్సవము లేదని ప్రధాన ఆలయము ప్రకారము చుట్టూ మాత్రమే పల్లకీ ఊరేగింపు ఏర్పాటు చేయబడును.