రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

 *రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం*



*:రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖా మాత్యులు మాల గుండ్ల శంకర నారాయణ.*


*:నైపుణ్య రథం ను ప్రారంభించిన మంత్రి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.*


గుట్టూరు,అక్టోబర్,29 (ప్రజా అమరావతి):


*రాష్ట్రంలోని విద్యార్థినీ,విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖా మాత్యులు మాల గుండ్ల శంకర నారాయణపేర్కొన్నారు.పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని గుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శుక్రవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు EDII ద్వారా ఏర్పాటు చేసిన నైపుణ్య రథంను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు మాల గుండ్ల శంకర నారాయణ, హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు  గోరంట్ల మాధవ్ తో కలిసి ప్రారంభించారు.*


*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యార్థినీ,విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేందుకు మరియు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య రథం ద్వారా అవగాహన కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూనే, పారిశ్రామిక ,సాంకేతిక, ఉత్పత్తి, విద్య, వైద్య ,నైపుణ్యతలకు సంబంధించిన రంగాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. విద్యారంగంలో నాడు -నేడు కార్యక్రమం రూపకల్పన ద్వారా మౌలిక వసతులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నతమైన బోధనను అందిస్తున్నారన్నారు. అలాగే విద్యతో పాటు వైద్య రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ పెనుగొండ నియోజకవర్గంలో 475 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల ఏర్పాటు మరియు  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం, రాష్ట్రం, రాష్ట్ర ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల అవగాహనతో పాటు సమస్యలు తీర్చాలన్న తపన ఆయనలో ఉందన్నారు. సమస్యల నుండి రాష్ట్ర ప్రజలను పడేయాలనే ఆకాంక్ష కూడా ఆయనలో ఉందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలలో పుస్తకాలకే పరిమితం కాకుండా వాటితో పాటు కంప్యూటర్ విద్య ,క్రీడలు, మానసిక ఉల్లాసం కార్యక్రమాల ఏర్పాటు పై ముఖ్యమంత్రి దృష్టికి సాధించారన్నారు. అందులో భాగంగానే నైపుణ్య రధాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు .కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలను గురించి తెలుసుకోవడం, అర్హతల మేరకు వాటిని పొందడం, అలాగే మహిళలకు రక్షణ ఇచ్చే దిశ యాప్ ఉపయోగించుకోవచ్చన్నారు.రాష్ట్రంలోని పేద ప్రజల పిల్లలు ఆంగ్లంలో చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని, ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా,సామాజికంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం సాంకేతిక రంగానికి ప్రాధాన్యతఇచ్చామనిచెబుతూనే ఇతర రంగాలను విస్మరించిందన్నారు. వాటిలో కూడా మాటలకే పరిమితం అయ్యారన్నారు.  2014వ సంవత్సరం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం, 'జాబు కావాలంటే బాబు రావాలి'అనే నినాదంతో వెళ్లారని,వారి అబ్బాయికి మినహా ఎవరికీ ఉద్యోగాలు రాలేదని మంత్రి విమర్శించారు.*


*నైపుణ్య రథం ప్రోగ్రాం ద్వారా మొత్తం నాలుగు కార్యక్రమాలను తెలియజేయడం జరుగుతుందన్నారు.ప్రత్యేకించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ పై అవగాహన పెంపొందించటం, నిరుద్యోగ యువతీ,యువకులకు కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు MS Office, Photoshop, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, బయో డేటా తయారుచేసుకొనే విధానం నేర్పించడం జరుగుతుందన్నారు.అలాగే డ్వాక్రా మహిళలకు కంప్యూటర్ పై పూర్తి అవగాహన మరియు ఆన్లైన్ నగదు రహిత లావాదేవీలు గురించి నేర్పించడం జరుగుతుందన్నారు.*


*కమ్యూనిటీ ప్రోగ్రాం

ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు మరియు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ పథకాలు వాటి వినియోగం మరియు వివిధ పథకాల ద్వారా పొందుతున్న లాభాలను గురించి వివరిస్తారన్నారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు గురించి వివరణ మరియు వారి అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకొనే విధానాన్ని వివరిస్తారన్నారు. అంతేకాకుండా విద్య,ఆరోగ్య-పరిజ్ఞానం,పరిసరాల పరిశుభ్రత,నీరు-మీరు,పాడి-పంట,మహిళా-శిశు సంక్షేమము వంటిఅంశాలపై వీడియోలద్వారా అవగాహన కక్పించడం జరుగుతుందన్నారు.*


ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు వెల్ఫేర్) గంగాధర్ గౌడ్ ,డిప్యూటీ ఈవో రంగస్వామి, ఎమ్మార్వో నాగరాజు, ఎంఈఓ గంగప్ప , జెడ్పిటిసి శ్రీరాములు , ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి, ఎంపీటీసీ నిర్మల నారాయణ స్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగలూరు బాబు, సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాసులు , మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి,  జడ్పీహెచ్ స్కూల్ హెడ్మాస్టర్ గోవింద రావు, స్కూల్ కమిటీ చైర్మన్ నజీర్ అహ్మద్, ఈశ్వరయ్య , జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి , EDII ప్రతినిధి ప్రకాష్ కిరణ్  తదితరులు పాల్గొన్నారు.