రాజకీయాల నుండి చంద్రబాబు వైదొలిగే సమయం ఆసన్నమైంది

 


- రాజకీయాల నుండి చంద్రబాబు వైదొలిగే సమయం ఆసన్నమైంది 


- మతిస్థిమితం కూడా పూర్తిగా కోల్పోయారు 

- వైసీపీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల గుడివాడ, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): రాజకీయాల నుండి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా వైదొలిగే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అన్నారు. బుధవారం గుడివాడ పట్టణం శరత్ థియేటర్లోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, పూర్తి విజ్ఞతతో నడుచుకుంటున్నారని చెప్పారు. గత రెండున్నర ఏళ్ళ పాలనలో పేదప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డిని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి పాలన ఇదే విధంగా కొనసాగిస్తే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందన్న అభిప్రాయంలో ఆ పార్టీ శ్రేణులు ఉ న్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా అస్థిరపర్చాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలకు తెరలేపారన్నారు. దీనిలో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో సీఎం జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడించారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిందంటూ పిల్లల తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని కలుగజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఏవైనా చిన్నపాటి లోపాలుంటే ప్రతిపక్షాలు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. అలాకాకుండా ప్రతి విషయాన్నీ సీఎం జగన్మోహనరెడ్డికి ఆపాదించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రి కొడాలి నాని అన్నట్టుగా చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని అర్ధమవుతోందన్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఉన్న పట్టాభితో కోట్ల మంది ప్రజలు అభిమానించే జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. స్థాయి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవహరించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబుకు విపరీతమైన భయమని అన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో ఏది మాట్లాడినా కక్ష సాధింపు చర్యలు ఉండవనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే చెప్పవచ్చని, వెంటనే సరి చేసుకుంటామన్నారు . అలాగే డ్రగ్స్ మాఫియాకు సంబంధించి సమాచారం ఉన్నా పోలీసులు దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ముడి పెట్టే ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనిచ్చేది లేదని గొర్ల శ్రీను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి  నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకట లక్ష్మి, నాయకులు తులిమిల్లి యేషయ్య, నైనవరపు శేషుబాబు, తోట రాజేష్, షేక్ బాజీ, మెండా చంద్రపాల్, మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image