ఉత్సవ ఏర్పాట్లు పూర్తి - జిల్లా కలెక్టర్

 


*ఉత్సవ ఏర్పాట్లు పూర్తి - జిల్లా కలెక్టర్*


*కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించండి*


విజయనగరం, అక్టోబర్ 18 (ప్రజా అమరావతి) :- ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి నిన్న, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారాన్నరు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. అలాగే పైడి తల్లి అమ్మవారి ఆశిసుల తో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.